Site icon NTV Telugu

కౌశిక్​రెడ్డికి షాక్‌.. మాణిక్కం ఠాగూర్‌ లీగల్‌ నోటీసు

Manickam Tagore

Manickam Tagore

ఆడియో టేపు లీక్‌ వ్యవహారంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుజురాబాద్‌ నేత కౌశిక్‌రెడ్డికి మరో షాక్‌ తగిలింది… టీపీసీసీ చీఫ్‌గా రేవంత్​రెడ్డిని నియమించేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై సీరియస్‌గా స్పందించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్… పాడి కౌశిక్​రెడ్డికి లీగల్​నోటీసులు పంపారు.. కౌశిక్‌కు మదురై కోర్టు నుంచి ఈ లీగల్​నోటీసు జారీ అయ్యాయి… దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనగా… లేకపోతే కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.. ఈ వ్యవహారంపై ట్విట్టర్‌లో స్పందించిన మాణిక్కం ఠాగూర్.. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు విధేయులుగా ఉన్నవారు ఎప్పుడూ నాపై తప్పుడు ఆరోపణలు చేస్తారని.. ఎందుకంటే.. టీఆర్ఎస్‌ను ఓడించి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించడమే నా ప్రాథమిక కర్తవ్యం కాబట్టి అన్నారు.. నా న్యాయవాదులు పరువు నష్టం దావా నోటీసు జారీ చేశారు.. మదురైలో ఫిర్యాదు నమోదు చేయబడుతుందని.. కౌశిక్‌రెడ్డికి మదురై కోర్టుకు స్వాగతం అంటూ ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు ఠాగూర్‌.

Exit mobile version