NTV Telugu Site icon

Agnipath Scheme: వాట్సప్ చాటింగ్ లలో అల్లర్లకు ప్లాన్.. పెట్రోల్ బాటిల్ తో.. రావాలంటూ ఆదేశాలు

Se786

Se786

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం సిటీ పోలీసులు విచారణ చేప‌ట్టారు. ” చలో సికింద్రాబాద్ “అనే వాట్సప్ గ్రూపు సభ్యులను పోలీసులు గుర్తించారు. ముందస్తు కుట్రతోనే విధ్వంసం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు చొరబడి నట్లు గుర్తించారు పోలీసులు. రెండు రోజుల క్రితమే వాట్స్అప్ గ్రూపులు క్రియేట్ చేసి విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

హకీంపేట్ ఆర్మీ ర్యాలీ కి వచ్చినవారే విధ్వంసానికి పాల్పడినట్లు గుర్తించిన‌ పోలీసులు. ఆదిలాబాద్ నుంచి కృష్ణ ఎక్స్ప్రెస్ లో 300 మంది అభ్యర్థులనువచ్చినట్లు, సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు ఆధారంగా ఆందోళనకారులను పోలీసులు గుర్తిస్తున్నారు. ఆందోళనకారులపై 14 సెక్షన్ల కింద రైల్వే పోలీసులు కేసు నమోదు చేసారు. ఐఆర్ఎ రైల్వే చట్టం సెక్షన్ 150 నమోదు చేసిన పోలీసులు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే యావజ్జీవం లేదా మరణశిక్ష పడే అవకాశం వుంద‌ని వెల్ల‌డించారు.

గురువారం నాడు వాట్సప్ చాటింగ్ లలో అల్లర్లకు ప్లాన్

పెట్రోల్ బాటిల్ పట్టుకొని రావాలంటూ ఆదేశాలు అందాయని, పెట్రోల్ తో పాటుగా టైర్లు పాత దుస్తులు తీసుకొని రావాలని ఆదేశింనట్లు కాల్ రికార్డింగ్ గుర్తించారు పోలీసులు. పెట్రోల్ తీసుకువచ్చి తల తగలపెడితే విషయం మొత్తం తెలుస్తుందని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. సాధారణంగా ధర్నా చేస్తే ఎవరు పట్టించుకోరని ఆందోళనకారులు చెప్పడంతో ఇంత విధ్వంసానికి దారితీసిందని తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ కు వస్తున్న ప్రతి ఒక్కరు పెట్రోల్ బాటిల్ తో రావాలని చెప్పిన తీరు పోలీసులకు దిగ్భ్రాంతిని గురిచేసింది. వాట్సాప్ గ్రూప్ ల నుండే విధ్వంసం ప్లాన్ చేసుకున్నారని తెలుసుకున్న పోలీసులు వారి వద్దనుంచి పెట్రోల్ బాటిల్స్, పాత దుస్తులు, టైర్లు తెచ్చుకోవాలని ఆడియో సంభాషణ లను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ గ్రూప్ ఆర్గనైజర్స్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.నిన్న స్టేషన్ లో ఆందోలనకారులని అరెస్ట్ చేసిన పోలీసులు.

గాంధీ హాస్పిటల్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో జరిగిన కాల్పులలో గాయపడిన వారికి గాంధీ ఎమర్జెన్సీలో ట్రీట్‌మెంట్ కొనసాగుతోంది. 10 మందికి పైగా ఆందోళనకారులకు గాయాలయ్యాయి. గాంధీ హాస్పిటల్‌లోకి ఇతరులను పోలీసులు రానివ్వడం లేదు. గాంధీ హాస్పిటల్ సిబ్బంది సహా పేషేంట్స్, అటెండెంట్స్ ఐడీలు చూసిన తర్వాత పోలీసులు లోపలికి అనుమతి ఇస్తున్నారు.