Palvai Sravanthi: పాల్వాయి స్రవంతి ప్రెస్ మీట్.. ఓటమిపై చర్చ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palvai Sravanthi: మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫలితాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఓటమికి గల కారణాలు, జరిగిన తప్పులపై చర్చించారు. కేవలం డబ్బు, మద్యం పంచి అధికారపార్టీ ఎన్నికల్లో విజయం సాధించిందని స్రవంతి ఆరోపిస్తున్నారు. కాసేపట్లో ఆమె హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం స్రవంతి మీడియా సమావేశం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మునుగోడులో ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుకోలేకపోయింది…ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీలకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇక,మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే వరకు విజయం ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఎర్లీ ట్రెండ్స్‌తోనే తాము ఓడిపోతున్నామని గ్రహించింది. కానీ డిపాజిట్ కూడా దక్కకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను నింపింది. అయితే మునుగోడులో కాంగ్రెస్ ఘోర ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇక..అలాగే మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తరపున కొందరు నాయకులు మాత్రమే ప్రచారానికి వెళ్లారు. కొందరు ముఖ్య నాయకులైతే, ఒకటి రెండు సార్లు ప్రచారానికి వెళ్లివచ్చి.. మళ్లీ కనీసం అటూ వైపు కూడా చూడలేదు. అంతేకాకుండా.. కాంగ్రెస్‌లో నెలకొన్న కుమ్ములాటల కారణంగానే ఆ పార్టీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. మరి కొందరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా కూడా మునుగోడులో ప్రచారానికి ఆసక్తి చూపలేదనే టాక్ కూడా వినిపించింది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రవేశించడంతో చాలా మంది పాదయాత్రలో పాల్గొని.. మునుగోడుకు వెళ్లలేదు. దీంతో పూర్తిగా డబ్బు మాయంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యం పంపిణీలో వెనకబడిందని స్వయంగా ఓటర్లే చెప్పడం చూశాం. ఈనేపథ్యంలో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి ఇబ్బందికరంగా మారాయి. ఇక, మహిళల్లో ఆమె సానుభూతి సంపాదించుకుంటున్నట్టుగా కనిపించినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా మునుగోడులో కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంకును నిలబెట్టుకోవడంలో మాత్రం విఫలమైంది. మరి ఈ వరుస ఎదురుదెబ్బలను తట్టుకుని.. తెలంగాణలో కాంగ్రెస్ ఏ మేరకు పటిష్టంగా నిలదొక్కుకుంటుందో అనేది వేచిచూడాల్సిందే.
Kalyan Ram: ఆసక్తి రేపుతున్న కల్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్
Also Read
తాజావార్తలు
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!