Adulterated Liquor : కల్తీ కల్లు కేటుగాళ్లు తెలివి మీరి పోయారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు.. వ్యాపారాన్ని పెంచుకునేందుకు మాంచి స్కెచ్చేశారు. ఏకంగా కల్తీ కల్లును ప్యాకెట్లలో ప్యాకేజింగ్ చేసి మరీ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నారు. చిన్న హోటళ్ల ద్వారా అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివార్లలో కల్తీ కల్లు ప్యాకెట్లు చూసి ఎక్సైజ్ పోలీసులే షాక్ అయ్యారు.
ఇక్కడ చూడండి.. ఇక్కడ మీరు చూస్తున్నవి పాల ప్యాకెట్లు అనుకుంటే పొరబడ్డట్టే… పాల ప్యాకెట్లు కాదు.. ఫినాయిల్ ప్యాకెట్లు అంతకంటే కాదు.. ఇవి కల్తీ కల్లు ప్యాకెట్లు. వును.. కల్లు ఇప్పుడు ప్యాకెట్లలో లభిస్తోంది. అది కూడా ఎక్కడో కాదు హైదరాబాద్ శివార్లలోనే లభ్యమవుతోంది..
Hyderabad Rains : నీట మునిగిన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటన
గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్ ప్రాంతంలోని ఓ చిన్న హోటల్లో నిత్యావసర వస్తువులు, పాల ప్యాకెట్లతోపాటు ఈ కల్లు ప్యాకెట్లు కూడా అమ్ముతున్నాడు యజమాని. ఇది ఆ నోటా ఈ నోటా ఎక్సైజ్ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ పోలీసులు శంకర్ అనే వ్యక్తి నడిపిస్తున్న హోటల్‌పై దాడి చేశారు. మంచి ప్యాకేజింగ్ చేసి.. కస్టమర్లకు అందుబాటులో ఉంచిన కల్లు ప్యాకెట్లు వారికి కనిపించాయి. వీటిని ఎక్కడి నుంచి తెచ్చావని ప్రశ్నించారు. కానీ ఆ హోటల్ యజమాని శంకర్ మాత్రం చెప్పలేదు..
హోటల్ యజమాని నుంచి ఎలాంటి ఇన్ఫో లభించకపోయినప్పటికీ.. కల్లు ప్యాకెట్ల మీద ఉన్న బ్రాండ్‌తో పోలీసులు కూపీ లాగారు. SVS బ్రాండ్ పేరు మీద ఈ కల్లు ప్యాకెట్లు అమ్ముతున్నట్లు గుర్తించారు. మొత్తంగా ఆ హోటల్ నుంచి 270 లీటర్ల కల్లు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు…
వాయిస్: ఇక వీటి అధారంగా రంగంలోకి దిగిన మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు.. మల్కాజిగిరి పరిధిలోని ఓ కల్లు కాంపౌండ్‌పై దాడి చేశారు. 20 లీటర్ల కల్తీ కల్లును నేలపాలు చేశారు. అటు మలక్ పేట్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సైదాబాద్ ప్రాంతంలోనూ అనుమతి లేకుండా కల్లు అమ్మతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 750 లీటర్ల కల్లు స్వాధీనం చేసుకున్నారు. కల్లు శాంపిల్స్ తీసుకుని పల్లె బిక్షపతి, బోడిగే శ్రీనివాస్ గౌడ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు..