Site icon NTV Telugu

Revanth Reddy: కాంగ్రెస్ లో చేరిక‌లు.. రేవంత్ పై గుర్రుమంటున్న‌ నేత‌లు

Revanthreddy

Revanthreddy

తెలంగాణ కాంగ్రెస్ లో చేరిక‌ల తుఫాన్‌ మొద‌లైంది. కాంగ్రెస్ లో ఇత‌ర పార్టీ నేత‌లు చేర‌డంపై స్థానిక సీనిర‌య‌ర్ నేతల్లో అసంతృప్తి ఎదుర‌వుతోంది. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి చేరికలపై వ‌న్ మెన్ షో చేస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లు వెలువ‌డుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇటు సీనియర్లకు, అటు చేరికల కమిటీకి కూడా సమాచారం లేకుండానే త‌నంత‌కు తానే వ్య‌వ‌హ‌రించ‌డం పై విమ‌ర్శ‌ల‌కు తావులేపుతోంది. జానారెడ్డికి చేరికల పరిశీలన కోసం చైర్మన్‌గా కమిటీ వేసిన విష‌యం తెలిసిందే. అయినా కానీ ఆ కమిటీకి తెలియకుండానే చేరికలు కొనసాగుతుండటం చ‌ర్చ‌ల‌కు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనేంతవరకు తమ పార్టీలోకి ఎవరు వస్తున్నారో సీనియర్లతోపాటు ఆయా స్థానిక నేతలకు కూడా తెలియడం లేద‌ని టాక్‌. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఖైరతాబాద్‌ నుంచి విజయారెడ్డి, ఖమ్మం నుంచి తాటి వెంకటేశ్వర్ల చేరిక అని చెప్ప‌వ‌చ్చు.

ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క కీలకమైన నేత, శాసనసభ పక్షనేతతోపాటు పార్టీలోనే సీనియర్‌ కూడా ఆయ‌న‌. భ‌ట్టి సొంత జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లును పార్టీలో చేర్చుకోవడంపై ఆయనకు కనీస సమాచారం కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్ లో శుక్రవారం రోజు వెంకటేశ్వర్లు చేరిక సందర్భంగా భట్టి విక్రమార్కను విలేకరులు ప్రశ్నించగా.. వెంకటేశ్వర్లు చేరికపై ఎలాంటి సమాచారం త‌ద‌ని లేదని చెప్ప‌డంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రేవంత్ వ్య‌వ‌హారం పై ఎంత సీరియ‌స్ గా వున్నారో తెలుస్తోంది. ఆ చేరికల‌తో జ‌గ్గారెడ్డికి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం విజయారెడ్డి చేరికపై కూడా స్థానిక కాంగ్రెస్‌ నేతలైన దాసోజు శ్రావణ్‌, రాజు యాదవ్‌, రోహన్‌రెడ్డికి కూడా ఎలాంటి సమాచారం లేద‌నే తెలుస్తోంది. చేరిక‌ల‌పై రేవంత్ మాత్ర‌మే వ‌న్‌మాన్ ఆర్మీగా వ్య‌వ‌హ‌రించ‌డం పై అసంతృప్తి చెందిన దాసోజు శ్రావణ్‌ పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టు ఉంటున్నార‌ని టాక్‌.

LIVE: దూసుకొస్తున్న నాలుగో వేవ్.. కరోనా మళ్ళీ కాటేస్తుందా?

Exit mobile version