NTV Telugu Site icon

Raksha Bandhan Celebrated at Pragathi Bhavan: కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత

Ktr

Ktr

దేశంలో రాఖీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగ సంబురాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. అయితే.. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటున్న క్రమంలో ప్రగతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈనేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

read also: MP Gorantla Madhav Video Issue: ఫోరెన్సిక్ రిపోర్ట్ లేకుండా.. ఆ విడియో ఫేక్‌ అని ఎలా చెబుతారు..?

అనంతరం మంత్రి కేటీఆర్‌ రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సులో వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాగా.. తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని, వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, మానవాభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు. ఈసందర్భంగా.. ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

దీనిలో భాగంగా.. ప్రభుత్వ పాత్ర పరిమితంగానే ఉండొచ్చు కానీ.. ప్రోత్సహించడానికి తాము కృషిచేస్తామన్నారు. అంతేకాకుండా.. యువత విద్యార్థి దశలోనే సమాజం పట్ల అవగాహన పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. విద్యార్థుల్లో అభిరుచి, దయాగుణం, విలువలు నేర్పించేందుకు ప్రయత్నిస్తామని, యునెస్కో ఎంజీఐఈపీ, ఏఐసీటీఈ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో ప్రముఖ ధ్యాన గురువు కమలేశ్‌ పటేల్‌, వివిధ రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Bandi Sanjay Letter to CM KCR: రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ