NTV Telugu Site icon

కాంగ్రెస్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి హెచ్చరిక…

కాంగ్రెస్ ఇంద్రవెల్లి దండోరా ను అడ్డుకుంటాం అని ఆదిలాబాద్ ఆదివాసి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. ఇంద్రవెల్లి దండోర ప్రకటన రోజు చేసిన రేవంత్ వ్యాఖ్యల పై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆదివాసి ,లంబాడాలు ఎక్కడ కలసి పోరాటం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆదివాసిల చరిత్ర తెలుసుకోని రేవంత్ రెడ్డి మాట్లాడాలి అని తుడుందెబ్బ నాయకులు తెలిపారు. ఆగస్టు 9 ఆదివాసిల దినోత్సవం.. అది మా పండుగ రోజు.. ఆరోజు ఇంద్రవెల్లి లో రాజకీయ వేదిక వద్దు. ఆదివాసీలు ,లంబాడాలు కలసి పోరాటం చేశారనీ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఆదివాసిలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే ఇంద్రవెల్లి దండోరాను అడ్డుకుంటాం అని పేర్కొన్నారు.