NTV Telugu Site icon

Adilabad District: బెట్టింగ్ భూతానికి యువకుడు బలి..

Suicide

Suicide

బెట్టింగ్‌కు యువకుడి బలైన ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జైనాథ్ మండలం పిప్పర్‌వాడ గ్రామానికి చెందిన అలిశెట్టి సాయి (23) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అభ్యుదయ హాస్టల్ కిచెన్ సహాయకుడిగా పని చేసేవాడు. బెట్టింగ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పోవడం వల్ల మనస్థాపం చెందాడు. అభ్యుదయ పాఠశాల ఆఫీస్ వంతెనల వద్ద ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన తండ్రి సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

READ MORE: Allu Arjun : నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్

కాగా.. బెట్టింగ్‌ యువతకు వ్యసనంగా మారింది. చేతిలో ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉంటే చాలు బెట్టింగ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంట్లో కూర్చొనే ఆడుకుంటున్నారు. మనీ వాలెట్‌ను డౌన్లోడ్‌ చేసుకుని అందులోకి బ్యాంకు ఖాతా, ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ చేసుకుంటున్నారు. ఈ బెట్టిగ్ కాయ్ రాజా కాయ్.. అంటూ తన వలలో వేసుకుంటోంది. బెట్టింగ్ భూతం జనం ప్రాణాలు తీస్తూనే ఉంది. ఈ మాయదారి రక్కసిని ఖతం చేసేందుకు ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చాపకింద నీరులా తన పని కానిస్తూనే ఉంది. ఈ బెట్టింగ్ మోజులో అమాయక యువకులు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఇంట్లో తెలియకుండా స్నేహితుల వద్ద అప్పులు చేసి పందేలు కాస్తున్నారు. తీరా ఓడిపోవడంతోనట్టేట మునుగుతున్నారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ.. మనస్థాపానికి గురవుతున్నారు. ఆదాయం లేక, ఇంట్లో అడగలేక, మళ్లీ అప్పులుచేయలేక.. ఏం చేయాలో అర్థంకాకపోవడంతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.

READ MORE:KTR: నేడు కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ!

Show comments