Online Betting: ఆదిలాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోయిన ఓ ప్రైవేట్ టీచర్ అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని ఎరోడ్రం సమీపంలో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్ లైన్ లో జూదం, పెట్టుబడులు పెట్టి అప్పుల పాలైన సదరు ప్రైవేట్ ఉపాద్యాయుడు.. సుమారు 20 లక్షల రూపాయల వరకు అప్పు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చేసిన అప్పుల భారంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ప్రభాకర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు.
Read Also: Raayan OTT: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ధనుష్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రాయన్’.. ఎక్కడ చూడొచ్చంటే..?
ఇక, ఈ సంఘటన ప్రదేశానికి చేరుకున్న ఆదిలాబాద్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
