NTV Telugu Site icon

Cold Wave in Adilabad: ఆదిలాబాద్‌లో వణికిస్తున్న చలి.. తెలంగాణ వైపు చలిగాలులు

Cold Wave In Adilabad

Cold Wave In Adilabad

Cold Wave in Adilabad: తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి గజగజ వణికిస్తోంది. నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత ఇంతకు ఇంతై నరాలను తెంచే విధంగా పెరుగుతుంది. నిన్నటి తో పోలిస్తే చలి ఇవాళ మరింతగా ఎక్కువైంది.

Read also: Furniture Shop Fire Accident: విషాదం.. ఫర్నీచర్ షాప్ దగ్ధమై, ఆరుగురు సజీవదహనం

రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ వైపు చలి గాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవడంతో పాటు చలి తీవ్రత పెరుగుతోంది. అడవులకు నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.5 డిగ్రీలు నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 9.7 డిగ్రీలు, నిర్మల్‌లో 10.3 డిగ్రీలు, మంచిర్యాలలో 10.5 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా హబ్సీపూర్‌లో 10 డిగ్రీలు, మెదక్ జిల్లా టేక్మాల్‌లో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, సమ్మనం ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. పల్లెలు, పట్టణాల్లో ఉదయం పూట పొగమంచు కమ్ముకుంటుంది. చలి తీవ్రతకు ఆదిలాబాద్ ప్రజలు మరింత వణికిపోతున్నారు.
Top Headlines- @ 9 AM: టాప్‌ న్యూస్‌