RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతో షార్ట్ సర్క్యూట్
- ప్రమాద సమయంలో ఎస్ఎన్సీయూ వార్డులో 27 మంది శిశువులు
- ప్రభుత్వానికి చేరిన ఆరుగురు సభ్యుల కమిటీ నివేదిక
- రిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్లపై చర్యలకు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో చోటుచేసుకున్న విషాదకర ఘటనపై ప్రభుత్వం నియమించిన ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీ (Six-Member High-Level Committee) తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ విభాగానికి (SNCU) చెందిన ఏసీ వైర్లను ఎలుకలు కొరకడం వల్లే వైర్లు షార్ట్ సర్క్యూట్‌కు గురై ప్రమాదం సంభవించినట్లు 50 పేజీలతో కూడిన ఈ విచారణ నివేదికలో కమిటీ స్పష్టంగా పేర్కొంది. ఏసీ బ్లాస్ట్ కావడంతో వార్డు అంతటా దట్టమైన పొగలు అలుముకున్నాయని, సిబ్బంది చిన్నచిన్న నిర్లక్ష్యాలు, లోపాలే ఐదుగురు చిన్నారుల ప్రాణాలు బలిగొన్నాయని కమిటీ అభిప్రాయపడింది.
ప్రమాద సమయంలో వార్డులో 27 మంది నవజాత శిశువులు
గత నెల 21వ తేదీ అర్ధరాత్రి వేళ రిమ్స్ ఆస్పత్రి ఎస్ఎన్సీయూ వార్డులో అర్ధాంతరంగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వార్డులో మొత్తం 27 మంది పసికందులు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం ధాటికి వార్డులో పొగలు అలుముకోవడంతో ఊపిరి ఆడక ఐదుగురు పసికందులు ప్రాణాలు కోల్పోగా, మిగిలిన బాధితులను వెంటనే కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారులందరూ పూర్తిస్థాయిలో కోలుకున్నారని అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం ఇదివరకే రూ. 5 లక్షల చొప్పున పరిహారం (ఎక్స్‌గ్రేషియా) చెక్కులను అందజేసింది.
Also Read
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
కమిటీ నివేదికపై గోప్యత.. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం
నిపుణుల కమిటీ ముందుగా ఈ సమగ్ర విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించగా, తాజాగా అది వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వానికి చేరింది. అయితే ఈ నివేదికలోని ముఖ్యాంశాల పట్ల అధికారులు తీవ్ర గోప్యత పాటిస్తున్నారు. ఆస్పత్రి నిర్వహణలో జరిగిన లోపాలు, భద్రతా ప్రమాణాల వీక్నెస్ను నివేదిక ఎత్తిచూపినట్లు తెలిసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను నివేదికలో సూచించారు.
రిమ్స్ డైరెక్టర్, సూపరింటెండెంట్లపై వేటు పడే అవకాశం
ఐదుగురు పసికందుల ప్రాణాలు బలిగొన్న ఈ విషాద ఘటన నేపథ్యంలో రిమ్స్ ఆస్పత్రి యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. రిమ్స్ ప్రస్తుత డైరెక్టర్ , ఆస్పత్రి సూపరింటెండెంట్లను బాధ్యతల నుంచి తప్పించి వారి స్థానంలో కొత్త అధికారులను నియమించేందుకు వైద్యారోగ్య శాఖ అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. కొత్త డైరెక్టర్ నియామకానికి సంబంధించి పలువురు సీనియర్ డాక్టర్ల పేర్లతో ఫైల్ సిద్ధమైందని, ఏ క్షణంలోనైనా కొత్త అధికారుల నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు