NTV Telugu Site icon

Adilabad KGBV Food Poison: చికెన్‌ తో ఫుడ్‌ పాయిజన్‌.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత

Adilabad Kgbv Food Poison

Adilabad Kgbv Food Poison

ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మొత్తం 28 మంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. విషయం తెలుసుకున్న అధికారులు కెజిబివి పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. గత రాత్రి తిన్న చికెన్ తోనే ఫుడ్ పాయిజన్ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. తరుచూ అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ఈ విషయం బయటకు చేబితే టిసి ఇచ్చి పంపుతారన్న భయంతో విద్యార్థులు బయటకు సమాచారం చెరవేయలేదని పలువురు విద్యార్థులు చెబుతున్నారు.

read also: Nethanna Bheema Scheme: గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ సర్కార్.. మరో కొత్త పథకానికి శ్రీకారం..

వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కెజిబివి పాఠశాలలో మొత్తం 240 మంది విద్యార్థులున్నారు. గత మూడు రోజుల నుండి ఆహారంలో తరుచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థులు తెలిపినా పాఠశాల సిబ్బంది పట్టించుకోలేదు. నిన్న ఆదివారం కావడంతో.. చికెన్‌ వండారని, అది తిన్న విద్యార్థులకు రాత్రి నుండి విద్యార్థులు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే పిల్లలు అస్వస్థతకు గురి కావడంతో.. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే పాఠశాలలో ఉదయం నుంచి విద్యార్థులు ఏమీ తినలేదని, భోజనం బాగుందని టీచర్లు చెబుతున్న భోజనం చేసేందుకు విద్యార్థులు భయపడుతున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

Encounter: మావోలు-పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.. మావోయిస్టు కమాండర్ మృతి!