NTV Telugu Site icon

BJP Leaders: తెలంగాణ బీజేపీలో కీలక నిర్ణయం.. ఈటల, అరవింద్‌లకు అదనపు భద్రత

Bjp Leders

Bjp Leders

BJP Leaders: తెలంగాణ బీజేపీ ఇద్దరు నాయకులకు వై ప్లస్ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. బీజేపీలో కీలక నేతలుగా ఉన్న ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్‌లకు అదనపు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సమాచారం. ఈటల రాజేందర్‌కు ‘వై’ ప్లస్ భద్రతను కేటాయించారు. ఈటల రాజేందర్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ఉంటారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. ఇందులో భాగంగా ధర్మపురి అరవింద్‌కు 8 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది రక్షణగా ఉంటారు.

Read also: Teachers Strike: దంపతుల ధర్నాతో దద్దరిల్లిన ధర్నా చౌక్.. బోనాలతో ప్రత్యేక ర్యాలీ..

ఈ క్రమంలో సీఆర్పీఎఫ్ బలగాలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ ఇళ్ల వద్ద పరిస్థితిని సమీక్షించనున్నారు. హైదరాబాద్‌తో పాటు నియోజకవర్గాల్లోని వారి నివాసాల భద్రతపై సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత భద్రతను ఏ విధంగా సమన్వయం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కానీ ధర్మపురి అరవింద్ నివాసంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుదారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇటీవల ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని ఆయన భార్య జమున ఆరోపించారు. ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈటల భద్రతపై ఆరా తీశారు. ఈ క్రమంలో వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు ఈటల కూడా తన భద్రతపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.
TS Congress: భట్టితో జూపల్లి భేటీ.. కొల్లాపూర్ సభపై చర్చ

Show comments