సీనియర్ నేతల మీటింగ్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో గాంధీభవన్ అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతా రాయ్, ఈరవర్తి అనిల్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని, ఇలాంటి తరుణంలో కొంతమంది వల్ల పార్టీ లోఇబ్బందికరంగా మారిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ లో విభజించు పాలించు లాగా చేస్తున్నారని, బ్రిటీష్ వాళ్ళు చేసిన పాలన లాగా చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలను, ఎంపీ లు, ఎమ్మెల్సీ లు సర్పంచులు అందరిని పార్టీ లో చేర్చుకున్నారని, మా పార్టీ నాయకులు చేరితే తప్ప టీఆర్ఎస్ బలపడే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు అయ్యాక అన్ని సభలు, సమావేశాలు పెద్ద ఎత్తున విజయవంతం అయ్యాయని, మా పార్టీ నాయకులతో టీఆర్ఎస్ నాయకులకు ఏమి పని, మంత్రి హరీష్ రావు మా పార్టీ సీనియర్ నేత వీహెచ్‌తో కలిశారన్నారు. ఇది కోకపేటలో జరిగిందని, వీహెచ్ అంటే మాకు గౌరవం ఉందని, పార్టీ లో సమస్యలు ఉంటే కొట్లాడండి కానీ శత్రువు దగ్గర మొకరిల్లితే ఎలా ఆయన ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల బాధ అని, వీహెచ్ నిబద్ధత గల నాయకులు తెలంగాణ ఏర్పాటు విషయంలో ఎంతో కష్టపడ్డారని ఆయన అన్నారు. ఆయనను హరీష్ రావు ఎందుకు రహస్యంగా కలిసి ఏమి చేశారని, హరీశ్ రావు కలవగానే ఇక్కడ పార్టీ మీటింగ్ ప్రారంభం అయ్యాయని, పార్టీలో అంతర్గత సమావేశంలో ఏమైనా మాట్లడండీ కానీ బయట శత్రువు దగ్గర రహస్య సమావేశాలు ఎందుకు అని ఆయన అన్నారు.