Site icon NTV Telugu

YS Viveka Murder Case: నేడు సీబీఐ కోర్టు ముందుకు నిందితులు.. కడప నుంచి తరలింపు

Cbi

Cbi

YS Viveka murder case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది.. నిందితులను ఇవాళ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చనున్నారు అధికారులు.. దీనికోసం కడప జైల్‌లో ఉన్న నిందితులు సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలను ప్రత్యేక పోలీసు బందోబస్తు మధ్య ఈ తెల్లవారుజామున 4 గంటలకు కడప జైలు నుంచి హైదరాబాద్‌కు తరలించారు.. నిందితులను నాలుగు వాహనాల్లో హైదరాబాద్‌కు తరలించారు.. ఇక, ఉదయం 10:30 గంటలకు ఈ ముగ్గురు నిందితులు తోపాటు బెయిల్ పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి కూడా సీబీఐ కోర్టులో హాజరుకానున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివేకా కేసు విచారణ కడప నుంచి హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో.. తొలిసారిగా వివేక హత్య కేసులోని ఐదుగురు నిందితులు ఇవాళ సీబీఐ కోర్టు ముందు హాజరు కానున్నారు.

Read Also: Pakistan Economic Crisis: పాకిస్తాన్ పని ఖతం..ఐఎంఎఫ్‌తో చర్చలు విఫలం..

వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణ ప్రక్రియ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టులో ప్రారంభించిన నేపథ్యంలో ఐదుగురు నిందితులను న్యాయమూర్తి ప్రత్యక్షంగా, కోర్టులో భౌతికంగా చూడన్నారు. తదుపరి న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ముగ్గురు నిందితులైన సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దేవి రెడ్డి శివశంకర్ రెడ్డిలను తిరిగి కడప జైలుకు తీసుకెళ్తారా? లేక హైదరాబాద్‌లోని మరో జైలుకు తరలిస్తారా? అనేది న్యాయమూర్తి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నిందితులను హైదరాబాద్‌కు తరలిస్తున్నారన్న సమాచారంతో గురువారం సాయంత్రమే దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన భార్య తులసమ్మ, కుమారుడు చైతన్య రెడ్డి జైలుకెళ్లి శివశంకర్ రెడ్డిని కలిశారు.. శివశంకర్ రెడ్డి అనుచరులు కూడా చాలామంది హైదరాబాద్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది..

Read Also: Yahoo: లేఆఫ్ ప్రకటించనున్న యాహూ.. 20 శాతం ఉద్యోగులకు ఉద్వాసన

2021 అక్టోబరు 26న వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసి చేసింది.. జనవరి 31, 2022న అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. నాలుగేళ్లుగా సంచలనం సృష్టింస్తూనే ఉన్న ఏపీ మాజీ మంత్రి వైఎస్ హత్య కేసులో నిందితులను ఇవాళ కోర్టులో హాజరుపర్చనున్నారు.. సుప్రీంకోర్టు కడప నుంచి హైదరాబాద్‌కు కేసును బదిలీ చేసిన తర్వాత నిందితులు కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని సీబీఐ కోర్టు నిందితులందరికీ వేర్వేరుగా సమన్లు జారీ చేసింది. కడప జైలులోని నిందితుల లాడ్జికి ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేయగా, మరో ఇద్దరు నిందితులకు దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. వివేకానంద రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికలకు ఒక నెల ముందు అంటే మార్చి 15, 2019న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో అనుమానాస్పదంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్‌లు) సోదాలు నిర్వహించినా మిస్టరీని ఛేదించడంలో విఫలమయ్యాయి.. కొంతమంది బంధువులపై అనుమానం వ్యక్తం చేసినా.. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2020లో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. 2021 అక్టోబరు 26న హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసి, జనవరి 31, 2022న అనుబంధ ఛార్జిషీటును దాఖలు చేసింది. హత్య వెనుక పెద్ద కుట్రపై విచారణ మరియు దర్యాప్తును హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టుకు సుప్రీం కోర్టు బదిలీ చేసింది.

Exit mobile version