Site icon NTV Telugu

Palamuru – Ranga Reddy Lift Irrigation: పాలమూరు లిఫ్ట్ పనుల్లో‌ అపశృతి.. క్రేన్‌ వైరు తెగి ఐదుమంది మృతి

Palamuru

Palamuru

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్‌ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో రేగమనగడ్డ వద్ద పంపు హౌస్‌ను నిర్మిస్తున్న క్రమంలో కార్మికులు క్రేన్‌ సహాయంతో పంపు హౌస్‌లోకి దిగుతున్నారు. దీంతో ఒక్కసారిగా క్రేన్‌ వైరు తెగిపోయింది. ఆక్రైన్ దిగుతున్న కార్మికులపై పడటంతో.. దీంతో.. ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక కార్మికునికి తీగ్రంగా గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రుడికి సమీపంలోని దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతులందరు బీహార్‌కు చెందిన కార్మికులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణంపాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు.

పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల్లో క్రేన్ ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భ్రాంతి కలిగించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఉపాధి కోసం వేరే రాష్ట్రాలనుంచి ఇంత దూరం వచ్చి ఇక్కడ చనిపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఆకార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. ఈ ప్రమాదం జరగడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని బండిసంజయ్ కోరారు.

అయితే.. 2019 ఫిబ్రవరి 6న ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో 12.3 లక్షల ఎకరాలకు సాగు నీరు, వెయ్యి కి పైగా గ్రామాలకు తాగు నీరు అందించే పాలమూరు – రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ తుది అటవీ అనుమతులను మజూరు చేసింది. ఈనేపథ్యంలో.. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీకి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్‌ జనరల్‌ శ్రవణ్‌ కుమార్‌ వర్మ జనవరి 25న లేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి నాగర్‌ కుర్నూల్‌ జిల్లా అచ్చంపేట అటవి డివిజన్‌ లో ఉన్న 205.4811 హెక్టార్ల అటవీ భూమిని నీటిపారుదల శాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి 2017 మే నెలలో లేఖ రాసింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధనని ఫారెస్ట్‌ అడ్వైసరీ కమిటీ పరిశీలించి 2018 ఏప్రిల్‌ నెలలో మొదటి దశ అటవీ అనుమతిని మంజూరు చేసింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం విధించిన అన్ని విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేసిన కారణంగా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ప్రాజెక్టు కు తుది అటవీ అనుమతిని మంజూరు చేసింది.
Monkeypox: కేంద్రం అలర్ట్‌.. రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌..!

Exit mobile version