సింగరేణిలో మరో ప్రమాదం.. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే గనిలో…
మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనిలో మరో ప్రమాదం జరిగింది.. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు.. పై కప్పు కూలిపోవడంతో.. బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే నలుగురు మరణించారు.. ఇక, ఇవాళ ఉదయం శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గనిలో ప్రమాదం జరిగింది.. నల్లూరి సంతోష్ (ట్రామ్మర్ )కు ఈ ఘటనలో గాయాలు కాగా… రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలియాల్స ఉంది.. కానీ, వరుస ప్రమాదాలు సింగరేణి కార్మికులను టెన్షన్ పెడుతున్నాయి.
Also Read
తాజావార్తలు
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!