Site icon NTV Telugu

ఇటీవలే ఈటల రాజీనామా.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ సోదాలు

ACB Raids

ACB Raids

భూ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్.. ఆ తర్వాత టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు.. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన.. తాజా పరిణామాల తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు.. సొసైటీ లావాదేవీల వ్యవహారంలో అరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు.. పలు డాక్యుమెంట్లను పరిశీలించి సీజ్‌ చేసినట్టుగా తెలుస్తోంది… అయితే, ఈటల రాజీనామాతో ఏసీబీ సోదాలు నిర్వహించడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఎగ్జిబిషన్‌ సొసైటీలో అక్రమాలపై ఏసీబీ ఫోకస్‌ పెట్టినట్టుగా సమాచారం.

Exit mobile version