ప్రతి సంవత్సరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్ (నూమాయిష్) ఈ సారి ఏర్పాటు చేస్తారో లేదోనని ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నెలన్నర రోజుల పాటు అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన కనువిందుగా సాగుతుంది. హైదరాబాద్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్ ముత్యాల నుండి మైసూర్ శాలువాల వరకూ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. అయితే ఈ సంవత్సరం కరోనా కొత్త వేరియంట్…
కరోనా కారణంగా హైదరాబాద్‌లో ఈ ఏడాది నుమాయిష్ నిలిచిపోయింది. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుమాయిష్‌ను నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరిలో నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి.ప్రభాశంకర్ పేర్కొన్నారు. నుమాయిష్‌కు జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ సర్వీసెస్, విద్యుత్, రోడ్ల భవనాల శాఖల నుంచి…
భూ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్.. ఆ తర్వాత టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు.. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన.. తాజా పరిణామాల తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అవినీతి నిరోధక…