Site icon NTV Telugu

Telangana: రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ల బంద్‌.. డీఈవో ఆఫీసు ముట్టడి

School Band In Telangana

School Band In Telangana

అధిక ఫీజుల వ‌సూలు చేస్తూ విద్యార్థుల‌ను దోచుకుంటున్న పైవేట్ స్కూళ్ల దోపిడి నియంత్రించాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా పాఠ‌శాల‌ల బంద్ కు ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు పిలుపునిచ్చారు. పీజుల దోపిడితో పాటు ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో వ‌స‌తులు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ నిర‌స‌న చేప‌ట్టారు. తెలంగాణ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి పాఠ‌శాల‌ల్లోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాల‌ని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రజాసంఘాలుహైదరాబాద్ డీఈవో ఆఫీసు ముట్ట‌డి య‌త్నించారు. దీంతో కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త వాతావ‌ర‌నం నెల‌కొది. నిర‌స‌న కారుల‌ను పోలీసులు అదుపులో తీసుకుని స్టేష‌న్ కు త‌ర‌లించారు.

read also: Covid New variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్. ఇజ్రాయెల్ సైంటిస్టులు ఏమంటున్నారంటే?

ఏబీవీపీ కార్య‌కర్త‌లు మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడి నియంత్రించడంతోపాటు ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తేవాలని అన్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ , మెదక్ , జగిత్యాల జిల్లాలో పాఠ‌శాల‌ల బంద్ కొన‌సాగుతుంది. జిల్లా పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలటూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది ఏబీవీపీ. కాగా.. స్కూల్స్ రీ ఓపెన్ అయ్యి 20 రోజులవుతున్నా పుస్తకాలు పంపిణీ చేయలేదంటూ ఫైర్ అయ్యారు ABVP నేతలు. కాగా.. ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్, యూనిఫాంలు ఇవ్వాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేటు స్కూల్స్ లో ఫీజుల దోపిడిని అరికట్టాలన్నారు ఏబీవీపీ నేతలు.

Sand Mafia: ఇసుక స్మగ్లర్ల బరితెగింపు.. ఫారెస్ట్ అధికారులపై పెట్రోల్ దాడి

Exit mobile version