Nizam College: మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizam College Hostel: నిజాం కళాశాల హాస్టల్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించాడు. కలశాల ప్రిన్సిపాల్, ఉస్మానియా విసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. గత 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కార్యాలయం లోనికి ఏబీవీపీ నాయకులు వెళ్లేందుకు యత్నించాడంతో ఉద్రిక్తత నెలకొంది. లోనికి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకోవడంతో.. ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
Read also: భారతదేశంలోని 10 అద్భుతమైన ప్యాలెస్‌లు
Also Read
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
- Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించినా.. డిగ్రీ విద్యార్థులను హాస్టల్‌లో చేర్చుకునేందుకు కాలేజీ యాజమాన్యం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కళాశాల హాస్టళ్లలో వసతి అవసరమైన సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లోనే తమకు వసతి కల్పించాలని కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకోలేదని చెప్పారు. 50 శాతం యూజీ , 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికైనా ఉద్యమం నిలిపివేయాలని అధికారులు కోరారు. మొత్తం తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు 100 శాతం హాస్టల్ కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని యూజీ విద్యార్థులు స్పష్టం చేశారు.
నిజాం కాలేజీలో కొత్తగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థినులకు కేటాయించాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ జోక్యంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు 10 మంది విద్యార్థినులు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో సమావేశమై సమస్యపై చర్చించారు. కానీ, చర్చలు మాత్రం సఫలం కాలేదు.
Byjus: ‘‘బైజూస్.. నీకింత బిల్డప్ అవసరమా?’’
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!