Site icon NTV Telugu

Delhi Liquor Scam: స్పెషల్ కోర్టులో అభిషేక్ వేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ

Abhishek Boinapally

Abhishek Boinapally

Abhishek Boinapally Bail Petition Investigation In CBI Court: ఢిల్లీ లిక్కర్ స్కాంలో, మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి.. సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఈ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు అభిషేక్‌ను నేరుగా కోర్టుకు తీసుకెళ్లకుండా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. కాగా.. అభిషేక్ రిమాండ్ శనివారంతోనే ముగియగా, సీబీఐ స్పెషల్ కోర్టు మరో 21 రోజుల పాటు జ్యుడిషీయల్ రిమాండ్ పొడిగించింది. మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీలాండరింగ్ కేసులో ఈడీ శుక్రవారం సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేయగా.. దాని విచారణకు స్వీకరించడంపై ఈనెల 28న నిర్ణయం తీసుకుంటామని సీబీఐ స్పెషల్ కోర్టు తెలిపింది.

India vs Sri Lanka 2nd ODI: భారత బౌలర్ల ధాటికి శ్రీలంక చిత్తు.. 215 పరుగులకి ఆలౌట్

కాగా.. శుక్రవారం ఈడీ దాఖలు చేసిన 13,567 పేజీల చార్జ్‌షీట్​లో ఐదుగురు నిందితులు, ఏడు కంపెనీలపై అభియోగాలు మోపినట్లు ఈడీ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ తెలిపారు. ఇందులో రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ అభిషేక్, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు, ఆప్ కమ్యూనికేషన్ ఇన్​చార్జ్ విజయ్ నాయర్, బిజినెస్ మెన్ బినోయ్ బాబు, అమిత్ అరోరా పేర్లను ప్రస్తావించినట్లు వెల్లడించారు. దీనిపై జడ్జి నాగ్‌పాల్ స్పందిస్తూ.. సప్లిమెంటరీ చార్జ్ షీట్‌​ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఈ నెల 28న విచారణ జరుపుతామన్నారు. అలాగే, శరత్ చంద్రా రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్‌పై​ విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. అటు.. నవంబర్ 26న ఈడీ దాఖలు చేసిన తొలి చార్జ్ షీట్​లో మహేంద్రును ఏ1గా, ఏ2, ఏ3, ఏ4, ఏ5గా ఆయనకు సంబంధించిన నాలుగు కంపెనీలను చేర్చింది. దీంతో రెండు చార్జ్ షీట్‌లలో కలిపి నిందితుల సంఖ్య 17కు చేరింది.

Maalika Puram: అల్లు అరవింద్ చేతికి మరో సూపర్ హిట్ మూవీ రైట్స్!

Exit mobile version