NTV Telugu Site icon

Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్ కేసు.. అబ్బాస్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

Sayyad Abbas Ali Drugs Case

Sayyad Abbas Ali Drugs Case

Radisson Drugs Case: గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొందరి సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రాగా.. మరికొందరి పాత్ర వెలుగులోకి వస్తోంది. రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ కేసులో FIR లో మరో ఇద్దరిని నిందితులుగా పోలీసులు చేర్చారు. A11 గా వివేక్ డ్రైవర్ ప్రవీణ్, డ్రగ్ సప్లయర్ A12 గా మీర్జా వహీద్ బేగ్ పేర్లను పోలీసులు చేర్చారు. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు అబ్బాస్ తెలిపాడు. రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన, డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందితో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు. ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీ లో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నారు. డ్రగ్ పార్టీ లో శ్వేత ,లిసి ,నీల్ ,డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని తెలిపారు. డ్రగ్స్ పార్టీ జరిగిన ప్రతి సారి కూడా రాడిసన్ హోటల్ లోనే డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నరని అన్నారు.

Read also: Yarlagadda VenkatRao: యార్లగడ్డ ఉదారస్వభావం.. సొంత ఖర్చుతో కుట్టు మిషన్ల పంపిణీ..

పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ మీర్జా వహీద్ బేగ్ నుండి గ్రాము కొకైన్ ను 14 వేలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. వివేకా సూచనలు మేరకు అతని వ్యక్తి గత డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు తెలిపాడు. వివేక్ ఆదేశాలు మేరకు 2 గ్రాముల కొకైన్ ను డ్రైవర్ ప్రవీణ్ కి పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ డెలివరీ చేసినట్లు వెల్లడించాడు. రెండు గ్రాముల కొకైన్ ను సయ్యద్ అలీ కి డ్రైవర్ ప్రవీణ్ 32000 గూగుల్ పే ద్వారా చెల్లించాడని, ఈ నెల 24 తేదీన మధ్యాహ్నం వివేక్ తన స్నేహితులు రఘుచరణ్, కేదార్నాథ్, సందీప్,శ్వేత ,లిసి ,నిల్ ,డైరెక్టర్ క్రిష్ తో డ్రగ్ పార్టీ చేసుకున్నారని తెలిపాడు. పేపర్ రోల్‌ని ఉపయోగించి తన స్నేహితులతో కలిసి వివేక్ 3 గ్రాముల కొకైన్ సేవించారన్నాడు. రాడిసన్ హోటల్లోని 1200 & 1204 నెంబర్ గల రెండు గదుల్లో డ్రగ్స్ సేవించారని తెలిపాడు. డ్రగ్ పార్టీ కోసం వివేక్ తన స్నేహితుల్ని ఆహ్వానించిన వాట్సప్ ఛాటింగ్ ను పోలీసులు గుర్తించారు.
TS DSC Notification: నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్‌..! 11,062 పోస్టుల భర్తీకి ప్రభుత్వ నిర్ణయం