NTV Telugu Site icon

Love Affair: వీడియో కాల్‌ మాట్లాడుతూ లైవ్‌ లోనే ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారంతో..

Love Failor

Love Failor

Love Affair: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ప్రేమించిన అమ్మాయి పెళ్లికి దూరం అవుతుందన్న బెంగతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్‌ సిటీలోని కలాపట్టర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహ్మద్‌ తబ్రేజ్‌ అలీ, స్థానికంగా ఉండే అమ్మాయితో ప్రేమించికున్నారు. ఇద్దరి ఇళ్లలో పెళ్లికి ఒప్పుకున్నారు. అయితే.. కొద్దిరోజులుగా రెండు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కారణంతో ప్రేమ పెళ్లిలో బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య రిలేషన్‌ నడుస్తూనే ఉంది. ప్రేమికులిద్దరూ వీడియో కాల్‌ చేసుకుని మాట్లాడుకుంటున్న సమయంలో యువకుడు అలీ అక్కస్మాత్తుగా లైవ్‌ లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Read also: Balakrishna: అనంతపురంలో ‘వీరసింహారెడ్డి’ హంగామా!

ప్రేయని చూస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేయసి దూరం అయితే జీవించలేనని కుటుంబ సభ్యులకు చెప్పిన వినకపోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. కుటుంబ కలహాలతో ఓయువకుడు బలయ్యాడని స్థానికులు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన ప్రియురాలు అబ్బాయి బంధువులు సమాచారం అందించింది. అయితే కుటుంబ సభ్యులు గదిలో వెళ్లి చూడగా కొడుకు అప్పటికే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఏంజరిగింది అనే విషయమై ఆరా తీస్తున్నారు.
Teachers Changes Gender: విద్యార్థినితో పెళ్లి కోసం పురుషుడిగా మారిన టీచరమ్మ..

Show comments