Site icon NTV Telugu

Mulugu: ఆడాళ్లు మీకు జోహార్లు.. కాటేసిన పాముతో హాస్పిటల్ కి వచ్చిన మహిళ

Mulugu Sneks

Mulugu Sneks

Mulugu: పాము కరిస్తే ఏం చేస్తారు ? సాధారణంగా అయితే అందరూ వెంటనే అందుబాటులో ఉన్న హాస్పిటల్ కు వెళ్తారు. తమను పాము కాటేసిందని వైద్యం అందించాలని అభ్యర్థిస్తారు. అక్కడున్న డాక్టర్లు చికిత్స అందిస్తారు. అయితే ములుగు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పాము కాటేసిందని ఓ మహిళ ఏకంగా పాముతో సహా ఆసుపత్రికి వచ్చింది. దీంతో డాక్టర్లు అందరూ షాక్ అయ్యారు.

Read also: AP SSC 2024 Results: పదవ తరగతి ఫలితాలు లేటెస్ట్‌ అప్డేట్‌ ఇదే.. ఫలితాలు అప్పుడే..?!

ములుగు జిల్లాలో వెంకటాపురం మండలం ముకునూరుపాలెం గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళ కూలీ పని చేసుకుంటూ జీవనంసాగిస్తుంది. రోజులాగా సోమవారం కూడా కూలిపని కోసం వెళ్లింది. అయితే అక్కడ అందరితో కలిసి ఉపాధి పనులు చేస్తుండగా ఒక్కసారిగా ఆమెచేతికి ఏదో తాకినట్లు అనిపించింది. అయితే తరువాత ఆమె చేతి వేలికి నొప్పి ఎక్కవ కావడంతో ఏమైందంటూ చేతిని చూడగా పాముకాటు వేసి అక్కడి నుంచి వెళుతుంది. వెంటనే ఆ పామును గమనించిన శాంతమ్మ దానిని పట్టుకుంది. అక్కడ వున్న వారంత శాంతమ్మను చూసి షాక్ అయ్యారు. ఏం జరిగింది అని అడుతుండగానే వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లాలని శాంతమ్మ సూచించింది. స్థానికులు శాంతమ్మను వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లారు.

Read also: Gaami : ఓటీటీలో అదరగొడుతున్న గామి..కేవలం 72 గంటల్లోనే..?

అయితే ఆసుపత్రిలో శాంతమ్మ పాముతో సహా అడుగుపెట్టగానే అక్కడున్న రోగులే కాదు, నర్సులు, డాక్టర్లు అందరూ భయాందోళన చెందారు. శాంతమ్మ ఎందుకు పాముతో వచ్చిందో వారందరికి ఆర్దంకాలేదు. తరువాత శాంతమ్మ సార్ నా చేతి వేళికి ఈ పామే కాటేసింది.. చికిత్స చేయండి అంటూ వైద్యుడి దగ్గరకు వెళ్లగా పామును చూసిన వైద్యులు అది విషపూరితమైన పామని బయటకు తీసుకుని వెళ్లాలని సూచించాడు. శాంతమ్మను వెంటనే మెరుగైన వైద్యం అందించాడు. పామును బయట స్థానికులు చంపి బాలిల్లో వేసి పడేశారు. అయితే శాంతమ్మ పరిస్థతి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. శాంతమ్మ చేసిన సాహసానికి ఆశ్చరపోయిన ఆసుపత్రి సిబ్బంది ఆమె ధైర్యానికి ప్రసంశించారు.
Delhi Airport: ప్రపంచ రద్దీ ఎయిర్‌పోర్ట్‌ల్లో భారత విమానాశ్రయనికి చోటు..!

Exit mobile version