Gaami : ఓటీటీలో అదరగొడుతున్న గామి..కేవలం 72 గంటల్లోనే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’..మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయ్యిన ఈ మూవీ ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది.. అలాగే ఈ సినిమాలో ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. వి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పతాకంపై కార్తీక్ శబరీష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి నరేష్ కుమారన్ మ్యూజిక్ అందించారు.
థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న గామి మూవీ ఏప్రిల్ 12న ఓటీటీలోకి వచ్చింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.’జీ5′ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చిన గామి మూవీ ఓటీటీ లో విడుదలైన 72 గంటల్లోనే 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ కంప్లీట్ చేసుకుని అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.గామి సినిమా తెలుగుతో పాటు తమిళ మరియు కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.జీ5 ఓటీటీలో ఈ ఏడాది మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది.. విశ్వక్ సేన్ నటించిన మరో మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. దర్శకుడు కృష చైతన్య తెరకెక్కించిన ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.
Also Read
కేవలం 72 గంటల్లోనే 50Million Streaming Minutes తో సరికొత్త రికార్డ్ సృష్టించిన 'గామి'. Zee5 లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది వెంటనే చూడండి. pic.twitter.com/pEkVqzRhTn
— ZEE5 Telugu (@ZEE5Telugu) April 15, 2024
- Tags
- Gaami
- ott streaming
- Viswaksen
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!