NTV Telugu Site icon

పేట్ బషీరాబాద్‌లో దారుణం..

మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ కీచకుడు స్నేహి తుడి భార్య పై కన్నేసి ఆమె పై వేధింపులకు దిగాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రశాంత్‌ అనే వ్యక్తి తన స్నేహితుడి భార్యను ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ, స్నేహితుడి భార్యను వేధింపులకు గురి చేశాడు.

పలుమార్లు స్నేహితుడి భార్యపై అత్యాచారం చేసి వీడియోలను రికార్డ్‌ చేశాడు. వీడియోలు చూపించి మళ్లీ అత్యాచారం చేసిన తర్వాత డ బ్బులు ఇవ్వాలని బాధితురాలిని డిమాండ్‌ చేశాడు. డబ్బు ఇవ్వక పో తే వీడియోలు వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అప్ప టికే బాధితురాలి దగ్గర నుంచి రూ.16 లక్షలు వసూలు చేశాడు. అ యినా వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్ర యించింది. పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రశాంత్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.