Adilabad: చింతగూడలో ఎద్దుపై పెద్దపులి దాడి.. జాగ్రత్తలపై అటవీ శాఖ అవగాహన..
- ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచారం..
- గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అటవీశాఖ అవగాహన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండురోజులుగా పెద్దపులి సంచరిస్తు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న (బుధవారం) చింతగూడలో రైతు చూస్తుండగానే ఎద్దు పై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. అజ్జర్ వజ్జర్, చింతల్ బోరి , నిగిని చింతగూడ శివారులలో రెండు రోజులుగా పులి సంచరిస్తుందనే ప్రాంతాల్లో ఫారెస్ట్ సిబ్బంది కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశారు. పులి ఎద్దుపై దాడి చేయండలో అలర్ట్ అయిన అధికారులు దీంతో గ్రామస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు గ్రామాల్లో అవగాహన కల్పించారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ జోన్ నుంచి పులి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు.
Read also: KTR Tour: నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..
Also Read
పులిని బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో చింతగూడ ప్రాంతంలో ఓ మహిళ గుర్తించింది. దీంతో భయాందోళనకు గురైన మహిళ గ్రామస్థులకు సమాచారం అందించింది. గ్రామస్థులు వెళ్లి చూడగా పులి అక్కడ కనిపించలేదు. పులి పత్తి చేల నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. కొంత సేపటికి కొండ ప్రాంతంలోని పొలం వద్ద కట్టిన ఎడ్లు పులిని చూసి తాళ్లు తెంపుకుని గ్రామానికి చేరాయి. చింతగూడ గ్రామస్తులకు కొండ సమీపంలోని పత్తి వరిలో పులి పాదముద్రలు కనిపించాయి. బుధవారం దాన్ని పట్టుకునేందుకు దాదాపు 20 మంది బేస్ క్యాంపు సిబ్బంది అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. మరోవైపు నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ ఎకో పార్క్ పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఎకో పార్క్‌లో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుధవారం ఎకో పార్క్ కమాన్ వద్ద ఉన్న బొమ్మ చిరుత వద్దకు నిజమైన చిరుత వచ్చి కాసేపు నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Road Accident: రిసెప్షన్‌కు వెళ్తుండగా కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి
తాజావార్తలు
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్‌లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్‌ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!