NTV Telugu Site icon

Shamshabad: శంషాబాద్‌లో విషాదం.. సెప్టిక్ ట్యాంకులో పడి ఏడేళ్ల చిన్నారి మృతి

Shamshabad

Shamshabad

Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఏడేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులతో కలసి ఓ వివాహానికి హాజరైన బాలుడు ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read also: Kushitha Kallapu: ఆరంజ్ కలర్ సారీ తో పడేస్తున్న కుషిత కళ్లపు

నందిగ్రామ గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి తన భార్య మౌనిక, సోదరుడు, తల్లితో కలిసి వివాహానికి హాజరయ్యారు. తమతో పాటు ఐదేళ్ల కుమారుడు అభిజిత్‌రెడ్డిని కూడా తీసుకొచ్చారు. అయితే సాయంత్రం పెళ్లి బరాత్ వేడుక జరిగింది. ఇందులో సంగీత అభిజిత్ రెడ్డి డ్యాన్స్ చేశారు. అయితే నాలుగు గంటల తర్వాత బాలుడు అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అందరూ సమీప ప్రాంతాలకు చేరుకున్నారు. 6 గంటల తర్వాత కూడా బాలుడు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు ఆర్జీఐ పోలీసులను ఆశ్రయించి బాలుడు కనిపించడం లేదంటూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఫంక్షన్ హాల్ వెనుక సంపు దగ్గర అభిజిత్ రెడ్డి చెప్పులు కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే సంపు వద్దకు ప్రజలను పంపి సోదాలు చేశారు. అందులో బాలుడు ఛిద్రంగా పడి ఉన్నాడు. మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతికి ఫంక్షన్ హాల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఒప్పించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Tirumala: తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు.. టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు..