Site icon NTV Telugu

Lady Robot: అమ్మాయి కాదు రోబోనే

Robo

Robo

రోబోల గురించి ప్ర‌త్యేకంగా చెప్పనక్కర్లేదు, తెలుగులో రోబో సినిమా రావడానికి ముందే హాలీవుడ్‌లో ఐ రోబోట్ సంచలనం సృష్టించింది. రోబోలపై ప్రపంచానికి క్రేజ్ కలిగించిన చిత్రం అది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోబోలను ఈ సినిమాలో రూపొందించారు. అన్ని పనుల్లోనూ అవి సాయం చేస్తుంటాయి. నేడు ఆధునిక కాలంలో మనిషి కోరుకుంటున్నవన్నీ చేసిపెట్టే మరో మనిషి రోబో. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇందుకు దోహదం చేయబోతోందనే చెప్పొచ్చు.

ఇలాంటి రోబోను మ‌నం సినిమాలోనే కాదు నిజ జీవితంలో అది మ‌న‌కు స్వాగ‌తం పలుకుతూ మ‌నకు స‌ర్వ్ చేస్తే ఆ ఆనందమే వేరు. అదే రోబో అమ్మాయి అయితే! అమ్మాయి రోబోనా అనుకుంటున్నారా?. మీరు ఆ రోబోను చూడాల‌నుకునే వారు యూట్యూబ్ లో వెత‌క‌న‌క్క‌ర్లేదు.. దేశ విదేశాల‌కు వెళ్ల‌న‌క్క‌ర్లేదు. మ‌న తెలంగాణ‌ రాష్ట్రంలోనే మ‌న భాగ్యన‌గ‌రంలోనే ఈ రోబో త‌యారైంది. ఆ రోబోను చూసి మీరు అమ్మాయి అనుకుంటే మాత్రం ప‌ప్పులో కాలేసినట్టే. ఆమె ఎవరోకాదు మైత్రి అనే హ్యూమనాయిడ్‌ రోబో.

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని సర్క్యూట్‌ గ్రిడ్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థకు చెందిన యువ శాస్త్రవేత్తలు ఫణికుమార్‌, దుర్గాప్రసాద్‌ దీనిని ఆవిష్కరించారు. రిమోట్‌ సంకేతాల ఆధారంగా ఇది తన చేతుల్లోని వస్తువులను చెప్పినవారికి అందజేస్తుంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మైత్రిని ఆవిష్కరించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. పటాన్ చెరు పట్టణానికి చెందిన యువ శాస్త్రవేత్తలు హ్యూమనాయిడ్ రోబో ఆవిష్కరించడం అభినందనీయమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.

పటాన్ చెరు కేంద్రంగా పనిచేస్తున్న సర్క్యూట్ గ్రిడ్ ఎలక్ట్రానిక్స్ మైత్రి పేరుతో హ్యూమనాయిడ్ రోబోను తయారుచేసింది. ఆదివారం పటాన్ చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా రోబోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అందిస్తున్న ప్రోత్సాహం తో రాష్ట్రంలో యువ శాస్త్రవేత్తలు నూతన ఆవిష్కరణలు చేయడం సంతోషకరం అన్నారు.

పటాన్ చెరు నియోజకవర్గం గర్వపడేలా యువ శాస్త్రవేత్తలు ఫణి కుమార్, దుర్గా ప్రసాద్ లు రోబో ని తయారు చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, రాంచందర్, షకీల్, యువ శాస్త్రవేత్తలు ఫణి కుమార్, దుర్గా ప్రసాద్ లు పాల్గొన్నారు.

Telugu Desam Party: టీడీపీ ఆధ్వర్యంలో ‘ఛలో కంతేరు’.. మాజీ మంత్రి హౌస్ అరెస్ట్

Exit mobile version