Site icon NTV Telugu

పీవీ ఎక్స్ ప్రెస్ పిల్లర్ నంబర్ 296 వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రాజేంద్ర నగర్ పీవీ ఎక్స్ ప్రెస్ పిల్లర్ నంబర్ 296 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న హైమద్ అనే వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందాడు. హుటాహుటిన రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎక్స్‌ప్రెస్ వేపై టూ వీలర్స్‌కు అనుమతి లేదు. ఆరంఘర్ నుంచి మెహదీపట్నం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.కాగా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు నగరంలో అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం, ర్యాష్‌ డ్రైవింగ్‌ ప్రమాదాలకు కారణం అవుతుందని పోలీసులు పేర్కొంటున్నారు. పోలీసులు హెచ్చరిస్తున్నా ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి.

Exit mobile version