Site icon NTV Telugu

Secunderabad: సికింద్రాబాద్‌లో భారీ చోరీ.. రూ.5 కోట్ల సొత్తు ఎత్తుకెళ్లిన నేపాలి గ్యాంగ్

Thife Secendrabad

Thife Secendrabad

ఎవరిని నమ్మకూడదు ఇది పెద్దల చెప్పే మాట. గుడ్డిగా నమ్మి ఎదుటివారికి చేతికి తాళాలు అప్పగించామో మనం ఇంట్లో వున్న సొత్తును మరిచిపోవాల్సిందే.. వందలో ఒకరు మాత్రమే నీతి నిజాయితీగా ఉంటారు. వందకు వందశాతం డబ్బును చూస్తే ఆగలేరు. నమ్మకాన్ని పక్కనపెట్టి అందికాటికి దోచుకుని అక్కడి నుంచి జారుకుంటారు. ఓ యజమానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఇంట్లో నమ్మకంగా ఐదేళ్లుగా పనిచేస్తున్న ఓవ్యక్తిని నమ్మి ఇంటినే అప్పగించేశాడు. ఇదే అలుసుగా భావించిన ఆ వ్యక్తి ఐదేళ్లుగా స్కెచ్ వేసుకుని ఇంటినే గుల్లచేసి పరారయ్యాడు. ఒకటి కాదు రెండుకాదు కోట్లల్లో దొచుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.

Read also: Asia Cup 2023 Schedule: ఆసియా కప్‌కు బీసీసీఐ, పీసీబీ గ్రీన్‌ సిగ్నల్‌.. శ్రీలంకలోనే భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

కాగా.. సింధి కాలనీ పీజీ రోడ్డు డిమ్మీ పాన్‌షాప్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లోర్‌ అంతా రాహుల్‌ గోయల్‌, ఆయన ముగ్గురు సోదరుల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారు ఇనుము వ్యాపారం చేస్తున్నారు. నేపాల్‌కు చెందిన కమల్‌ వారి అపార్ట్‌మెంట్‌లో ఐదేళ్లుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. బోనాల పండుగను పురస్కరించుకుని రాహుల్ కుటుంబం ఈ నెల 9న నగర శివార్లలోని ఓ ఫామ్ హౌస్ కు వెళ్లింది. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చారు. ఇంటి మెయిన్ డోర్ తాళాలు, నేలపై ఉన్న 8 గదుల తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన వాచ్ మెన్ కమల్.. వారి ఇంట్లో కోట్ల విలువైన బంగారు, వెండి, వజ్రాల ఆభరణాలు ఉన్నట్లు తెలిసింది.

బోనాల పండుగకు వెళతారని ముందే తెలుసుకున్న కమల్ ఇతర నగరాల్లోని నేపాలీ దొంగలకు సమాచారం ఇచ్చి మొత్తం ఆరుగురు దొంగలు ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. దొంగలు ఆటోలో వచ్చి చోరీ చేసి ఆటోలో వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత ముందుగా బుక్ చేసుకున్న బస్సులో పారిపోయినట్లు తెలిసింది. ఇప్పటికే రెండు ప్రత్యేక బృందాలు విమానంలో నేపాల్ సరిహద్దుకు వెళ్లి దర్యాప్తు చేస్తున్నాయి. సొత్తు దోచుకుని పరారైనా నేపాలీలు ఒక్కసారి సరిహద్దులు దాటితే పట్టుకోవడం అసాధ్యం. పట్టుబడితే సొత్తు రికవరీ చేయలేం. నేపాల్ చట్టాలు దానిని అంగీకరించవు. కాబట్టి సరిహద్దు దాటకముందే వారిని పట్టుకునేందుకు నగర పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Flood fear in Delhi: యమున ఉగ్రరూపం.. ఢిల్లీకి వరద ముప్పు

Exit mobile version