Site icon NTV Telugu

Cheating: వీడు మామూలోడు కాదు.. 13 మందితో పెళ్లి.. కొండాపూర్‌లోనే ఏడు..

Hyderabad Cheting

Hyderabad Cheting

నగరంలో మరో నిత్య పెళ్ళికొడుకు వెలుగులోకి వచ్చాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మందిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని యువతులను మోసం చేశాడు. పెళ్లికి విడాకులు అయిన యువతులనే టార్గెట్ చేసాడు ఆ ప్రబుద్ధుడు. అదికూడా వివాహ పరిచయ వేదికే అతడ మార్గం. అయితే.. ఆ వ్యక్తికి ఏపీకి చెందిన మంత్రికి సమీప బంధువని టాక్.. దీంతో .. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. పెద్ద కంపెనీలో పనిచేస్తానని డే అండ్​ నైట్​ డ్యూటీలు ఉంటాయని, ఒకరి కళ్లుగప్పి ఇంకొకరి దగ్గరి వెళ్తూ కాలం వెళ్లదీశాడు. పెళ్లి చేసుకున్న వారందరినీ ఎక్కడెక్కడో ఉంచటం కాదు, పక్కపక్క వీధుల్లోనే ఉంచి ఎవరికీ దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంత అతితెలివి ఉన్న ఘనుడు ఎవరో కాదు.. ఏపీ మంత్రికి, సమీప బంధువు అడపా శివశంకర్​బాబు.

read also: Canada: గాంధీ విగ్రహానికి అవమానం.. ఘటనను ఖండించిన ఇండియా

ఆంధ్రా లోని గుంటూరు జిల్లా బేతంపూడికి చెందిన అడపా శివ శంకర్‌, వివాహ పరిచయ వేదిక ద్వారా ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. పెద్ద ఉద్యోగం కాబట్టి క్లయింట్‌ దగ్గరకు వెళ్తున్నాని చెప్పి, ఒకరి దగ్గరి నుంచి మరొకరి దగ్గరికి వెళ్తూ తన విషయం బయటపడకుండా జాగ్రత్తపడటమేకాకుండా.. రకరకాల కారణాలతో డబ్బులు లాగేవాడు. ఇలా శివశంకర్ మోసానికి దగాపడ్డ బాధితులంతా ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. అయితే.. శివశంకర్​ మోసానికి బలైన ఇద్దరు యువతులు హైదరాబాద్​ ప్రెస్​క్లబ్​లో ఈ నిత్యపెళ్లికొడుకు బాగోతాన్ని బయటపెట్టారు.

వివాహం పేరుతో తమను మోసం చేశాడని, సుమారు 60 లక్షల వరకు నగదు.. బంగారు ఆభరణాలు ఇచ్చామని బాధితులు కన్నీళ్ల పర్వంతమయ్యారు. శివశంకర్​ ఇప్పటికే చాలా మందిని మోసం చేసినట్టు తమకు సమాచారం ఉందని బాధితులు తెలిపారు. మోసపోయిన 13 మందిలో ఏడుగురు కొండాపూర్‌ ప్రాంతంలోనే ఉన్నారని, వారందరిని పక్కపక్క వీధుల్లోనే ఉంచుతూ ఈ మోసానికి పాల్పడ్డాడరని బాధితులు చెబుతున్నారు. తమలా మరికొంత మంది మోసపోకూడదన్న ఉద్దేశంతోనే.. తాము మీడియా ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే శివశంకర్‌పై పలు పోలీసుస్టేషన్‌లలో కేసులు ఉన్నా.. పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపించడమేకాకుండా.. శివశంకర్‌ను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధిత మహిళలు డిమాండ్‌ చేశారు.

RK Roja: చంద్రబాబు చిన్న మెదడు చితికిందా..? రోజా అనుమానం..!

Exit mobile version