Site icon NTV Telugu

Banjara Hills Crime: దారుణం.. చాక్లెట్‌ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై ఆటోలో అత్యాచారం

Banjarahils Crime

Banjarahils Crime

Banjara Hills Crime: దేశంలో యువతులపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అంతటా సమాన స్థానం వుంది, స్త్రీ పురుషలిద్దరూ సమానులే అని పైకి అంటారు కాని అన్ని చోట్లా అన్ని రంగాల్లోనూ అసమానతే ఉంటోంది. ఆడవారికి భద్రతా కరువవుతోంది. కామాంధులకు, వారి కామవాంఛలకు గురయ్యేది ముఖ్యంగా మహిళలే. కొన్ని ఘటనలు పైశాచికత్వానికి నిదర్శనంగా మారుతున్నాయి. కామాంధుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది చిన్నా పెద్దా తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కామంతో పసికందులను సైతం వదలడం లేదు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులపై కూడా దారుణానికి పాల్పడుతున్నారు. ఓ చిన్నారికి చాక్లెట్‌ ఇస్తానని ఆశ చపించాడు. తను దగ్గరకు రాగానే ఆచిన్నారిని ఆటోలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్‌ లో కలకలం రేపింది.

read also: MLA Arthur: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకూ ఆఫర్ వచ్చింది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

నగరంలోని బంజారాహిల్స్ లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యం చేసిన ఘటన సంచలనంగా మారింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు కన్ను పడింది. ఎలాగైనా ఆచిన్నారిపై తన కామవాంఛ తీర్చుకోవాలని ప్లాన్‌ వేశాడు. ఎవరు లేని సమయం కోసం వేచి చూశాడు. చివరకు ఆ సమయం రానే వచ్చింది. చిన్నారు బయట ఆడుకుంటున్న సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం గమనించాడు. దీంతో ఆ చిన్నారి దగ్గరకు వెళ్లాడు చాక్లెట్‌ ఇప్పిస్తానని ఆశ కలగించాడు. దీంతో చాక్లెట్‌ తిందామనే ఆశతో ఆచిన్నారి సైతం తనతో వెళ్లేందుకు సిద్దమైంది. ఎవరూ గమనించకపోవడంతో ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఎవరూ లేని ఖాళీ ప్రదేశానికి తీసుకెల్లాడు. ఒక ఆటోలో ఆ చిన్నారిని లైంగికంగా దాడి చేశాడు. దీంతో ఆ చిన్నారి భరించలేక ఏడుస్తూ గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకుని లైంగిక దాడి యత్నించిన నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పొక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Pakistan: పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన పాక్‌..

Exit mobile version