NTV Telugu Site icon

Delivery Boy Attacked: ఆర్డర్ ఆలస్యం అయ్యిందని.. డెలివరీ బాయ్‌పై దాడి

Food Delivery Boy Attacked

Food Delivery Boy Attacked

A Food Delivery Boy Attacked In Hyderabad For Delaying Order: అప్పుడప్పుడు ట్రాఫిక్ సమస్యల వల్లనో, హోటల్ యాజమాన్యం ఆలస్యంగా ఫుడ్ ప్యాక్ చేయడం వల్లనో.. ఫుడ్ డెలివరీ అనేది సమయానికి డెలివర్ అవ్వదు. పాపం.. డెలివరీ బాయ్స్ నిర్దేశించిన సమయానికి ముందే ఫుడ్‌ని డెలివర్ చేయాలని ఎంతో ప్రయత్నిస్తారు కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆయా సందర్భాల్లో ఆలస్యం అవుతుంటుంది. ఇలా ఆర్డర్ ఆలస్యం అయినప్పుడు.. కొందరు కూల్‌గానే రియాక్ట్ అవుతారు. ఏదో కారణం వల్ల ఆలస్యం అయి ఉంటుందని లైట్ తీసుకుంటారు. కానీ.. కొందరు మాత్రం అలా కాదు. కోపం రగిలిపోతారు. ఆర్డర్ ఎందుకు ఆలస్యమైందంటూ వీరంగం సృష్టిస్తారు. హైదరాబాద్‌లో హుమాయున్ నగర్‌కి చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే రెచ్చిపోయాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌పై దాడి చేయడమే కాకుండా, హోటల్‌ వద్ద కూడా చెలరేగిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

నిన్న (సోమవారం) రాత్రి ఒక వ్యక్తి తనకిష్టమైన ఫుడ్‌ని ఆర్డర్ పెట్టాడు. బాగా ఆకలితో ఉన్న అతగాడు.. ఎప్పుడెప్పుడు తన ఆర్డర్ వస్తుందా? అని వేచి చూశాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల డెలివరీ బాయ్ సమయానికి ఆహారాన్ని డెలివర్ చేయలేకపోయాడు. కొంచెం ఆలస్యంగా వచ్చాడు. దీంతో.. సదరు వ్యక్తి ఆర్డర్ ఎందుకు ఆలస్యం అయ్యిందంటూ ఫుడ్ డెలివరీ బాయ్‌తో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా అతడిపై దాడి చేశాడు. ఎలాగోలా అతని చెర నుంచి తప్పించుకొని, డెలివరీ బాయ్ భయంతో హోటల్‌లోకి పరుగులు తీశాడు. అప్పటికీ సదరు వ్యక్తి కోపం చల్లారలేదు. తన 15 మంది అనుచరుల్ని పిలిపించి.. హోటల్ వద్ద భయానక వాతావరణం సృష్టించాడు. హోటల్‌లోకి దూరి మరీ బాధితుడిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో మరిగె నూనె మీద పడి, ఫుడ్ డెలివరీ బాయ్‌తో పాటు నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, విచారణ చేపట్టారు.

స్త్రీలలో ఆ కోరికల్ని అమాంతం పెంచే.. 10 ఆహారాలు

Show comments