A Elder Woman Found On Youtube Who Is Missing From Two Years: అప్పుడప్పుడు కొన్ని ఊహకందని సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. చనిపోయారనుకుని అంత్యక్రియలు చేస్తున్న సమయంలో.. సడెన్‌గా లేచి కూర్చున్న సంఘటనలూ గతంలో ఎన్నో వెలుగుచూశాయి. ఇప్పుడు దాదాపు అలా పోలిన ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం ఇళ్లు వదిలివెళ్లిపోయిన తల్లి తిరిగిరాకపోయేసరికి, చనిపోయిందనుకొని ఆమె కుటుంబసభ్యులు కర్మకాండ నిర్వహించారు. తీరా రెండేళ్ల తర్వాత చూస్తే, ఆ ముసలావిడ యూట్యూబ్‌లో కనిపించడంతో ఫ్యామిలీ మెంబర్స్ ఖంగుతిన్నారు. చివరికి పోలీసులు ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Chada Venkat Reddy: మణిపూర్ దుర్మార్గానికి మోడీ, అమిత్ షాలే బాధ్యత వహించాలి
ఎన్టీఆర్ జిల్లా కొత్తగూడెంకు చెందిన నాగేంద్రమ్మను నాగేంద్రమ్మ అనే ఓ ముసలావిడ తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తోంది. ఈమెకు మతిస్థిమితం ఉండటంతో.. కుటుంబీకులు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే.. రెండేళ్ల క్రితం ఒకరోజు ఆమె ఇంటి నుంచి బయటకొచ్చింది. మతిస్థిమితం కారణంగా.. ఎక్కడికి వెళ్తున్నానో తెలీక వీధుల తిరిగింది. అప్పుడు ఖమ్మం జిల్లా మధిర పోలీసులు ఆమెను గమనించి, ఆసుపత్రికి తీసుకెళ్లారు. మతిస్థిమితం ఉందని తెలుసుకొని, ఒక అనాధాశ్రమంలో చేర్పించారు. అటు.. ఆమె కుటుంబ సభ్యులు నాగేంద్రమ్మ ఆచూకీ కోసం చాలా చోట్ల వెతికారు. బంధువులు, స్నేహితులను అడిగినా.. ఎక్కడా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో.. చనిపోయిందనుకొని, వాళ్లు కర్మకాండ నిర్వహించారు.
Viral Video: అడవికి రాజు సింహామే.. ఈ వీడియో చూస్తే ఎందుకంటారో మీకే తెలుస్తుంది..!
కట్ చేస్తే.. కర్మకాండ చేసిన రెండేళ్ల తర్వాత నాగేంద్రమ్మ ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్షమైంది. ఇది గమనించిన ఆమె కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. నిజమా, కాదా? అని తెలుసుకోవడం కోసం వృద్ధాశ్రమానికి వెళ్లగా.. అక్కడ నాగేంద్రమ్మని చూసి అందరూ సంతోషపడ్డారు. దీంతో.. కుటుంబ సభ్యులు ఆమెను పోలీసుల సమక్షంలో తిరిగి ఇంటికి తీసుకెళ్లారు.