Site icon NTV Telugu

ఢిల్లీలోనే మంత్రుల బృందం

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల అంశం ఇప్పుడిప్పుడే తేలేలా లేదు. ఓ వైపు యాసంగి సీజన్ ప్రారంభం అవుతుండటంతో రైతులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం వరి పంటను వేస్తే కొనమని ఇప్పటికే స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.వానాకాలం ధాన్యం కొనుగోలు పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది కాగా మరోసారి వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తో అమితుతమీ తేల్చుకోవడానికి రాష్ర్టప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే మంత్రుల బృందం మరోసారి ఢిల్లీకి వెళ్లింది.

Read Also: ప్రారంభమైన హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌

ఈ మేరకు మంత్రులు నిరంజన్‌రెడ్డి , కమలాకర్‌, దయాకర్‌ రావు, జగదీశ్వర్‌రెడ్డి, అజయ్‌కుమార్‌, ప్రశాంత్‌రెడ్డిపాటు ఎంపీలు సైతం ఢిల్లీ చేరుకున్నారు. వీరు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌తో అపాయింట్‌ మెంట్‌కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజు అపాయింట్‌ మెంట్‌ దొరకగానే వరిధాన్యం అంశంతో పాటు రాష్ర్టంలో ఇతర సమస్యలు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది. విభజన సమయంలో ఇచ్చిన హామీలను సైతం మంత్రుల బృందం కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది. దీనిపై కేంద్రం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి..

Exit mobile version