NTV Telugu Site icon

Bike Burst: దారుణం.. పెట్రోల్ బంక్‌లో బైక్ పేలి, ఒకరు సజీవదహనం

Bike Burst In Petrol Pump

Bike Burst In Petrol Pump

A Bike Burst In Petrol Bunk After Pump Got Stucked In Bike: కార్లు, బైక్స్‌కు నిప్పంటుకున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అయితే.. అంతకుమించిన భయంకరమైన సంఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఒక పెట్రోల్ బంక్‌లు పంప్ ఇరుక్కుని, ఒక బైక్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవదహనం అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు పెట్రోల్ కొట్టించుకోవడం కోసం బైక్ మీద ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లారు. అక్కడ తమ బైక్‌లో పెట్రోల్ కొట్టించారు. పెట్రోల్ కొట్టించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. నడుపుతున్న వ్యక్తి బైక్ స్టార్ట్ చేసి, కొద్దిగా ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో ‘పంప్’ బైక్ ఇంజిన్‌లో ఇరుక్కుపోయింది. వెనకాల కూర్చున్న వ్యక్తి అది గమనించి, ఆ పంప్ తీసేందుకు కిందకు దిగాడు.

Boyfriend Cheats Girl: పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇంతలో ట్విస్ట్ ఇచ్చాడు

అంతే.. ఆ వ్యక్తి దిగిన క్షణాల్లోనే ఆ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరుగులు తీశాడు. రైడర్ మాత్రం ఈ ఘటనలో అగ్నికి ఆహుతై, సజీవదహనం అయ్యాడు. మంటలు వ్యాపించడంతో.. పక్కనే ఉన్న బూత్‌‌కి సైతం మంటలు అంటుకున్నాయి. ఈ దెబ్బకు పెట్రోల్ బంక్ సిబ్బందితో పాటు ఆఫీస్‌లోని స్టాఫ్ కూడా అక్కడి నుంచి ప్రాణభయంతో పారిపోయారు. వెంటనే ఫైరింజన్లకు సమాచారం అందించి, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మరోవైపు.. ఈ ఘటనలో మృతిచెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వేసవి కాలం రావడంతో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి.. పెట్రోల్ కొట్టించేటప్పుడు వాహనదారులు, అలాగే సిబ్బంది జాగ్రత్తగా ఉండాల్సిందిగా పోలీసులు సూచిస్తున్నారు. కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన, ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని హెచ్చరిస్తున్నారు.

Manchu Manoj: నేను చేసిందేం లేదు.. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వచ్చాడంతే

Show comments