NTV Telugu Site icon

Girl Kidnap: 12ఏళ్ల బాలిక కిడ్నాప్.. పదిరోజుల తరువాత పోలీసులకు ఫిర్యాదు

Kidnap

Kidnap

Girl Kidnap: డబ్బుల కోసం పన్నెండేళ్ల బాలిక కిడ్నాప్ చేశారంటూ తండ్రి కృష్ణ.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన కలకలం రేపింది. తన కూతురు పదిరోజులుగా వెతుకుతున్నామని అయినా ఆచూకీ లభించలేదని తెలిపారు. నాకూతురిని ఎలాగైనా వారి వద్దకు చేర్చాలని ప్రాధేయపడ్డారు. పోలీసులకు తెలియజేస్తే ఎక్కడ తన కూతిరి చంపేస్తారో అని భయపడ్డామని చివరకు 10రోజులు గడుస్తు్న్నా ఇంతవరకు కూతురి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఆశ్రయించామని తెలిపారు. తమ సమీప బంధువే తన చిన్నారిని కిడ్నాప్‌ చేశారని ఆరోపించారు. తన కూతురిని ఎలాగైనా తన వద్దకు చేర్చాలని కోరారు.

Read also: Unable To Urinate For 14Months : 1లేదా 2రోజులు కాదు.. 14నెలలుగా మూత్రం పోయలేదు

హైదరాబాద్‌ లోని బంజారాహిల్స్‌లో కృష్ణ, సుజాత కుటుంబం నివాసం ఉంటోంది. వారిద్దరి 12ఏళ్ల శిరీష అనే కూతురు ఉంది. శిరీషను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న శిరీష పై సమీప బంధువైన ఒక వ్యక్తి కన్ను పడింది. ఈనెల 12న బాలిక కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు కృష్ణ, సుజాత బంజారాహిల్స్ లో తమ సమీప బంధువులపై ఫిర్యాదు చేశారు. పదిరోజులుగా బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రుల గాలించామని వాపోయారు. తమకు తెలిసిన దగ్గర బంధువులే కిడ్నాప్ చేసిన చేసినట్లు తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ కుమార్తెను కాపాడాలని.. తన భార్య బంధువులే డబ్బు కోసం తమ కుమార్తెను కిడ్నీప్‌ చేశారంటూ తండ్రి ఫిర్యాదులో తెలిపారు. పోలీసులను తక్షణమే స్పందించి శిరీష ఆచూకీ కనుగొని మాకు అప్పగించాలని కోరారు. పది రోజులుగా శిరీష ఎలా ఉందో.. ఎక్కడ ఉందో.. అంటూ తల్లిదండ్రులు చలించిపోతున్నారు.
Mekapati Chandrasekhar Reddy: నేను వెంకటరమణకే ఓటేశా.. అవన్నీ తప్పుడు ఆరోపణలే

మరో ఘటన వెలుగులోకి..

మరో విద్యార్థిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమ్రీన్‌ బేగం తొమ్మిదవ తరగతి చదువుతుంది. అమ్రీన్‌ అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయింది. కాగా.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని నూర్ నగర్ లో ఉండే అమ్రిన్ సెయింట్ నిజామియా హై స్కూల్ లో చదువుకుంటుంది. మార్చి 21వ తేదీన పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ చేశారు. ఇందుకోసం అమ్రీన్ బేగం జహీరా నగర్ లోని షాహిన్ కన్వెన్షన్ హాల్ కు వెళ్ళింది. అయితే.. రాత్రి 11 గంటలకు అమ్రీన్ సోదరుడు ఫోన్ చేయగా ఇంకా ప్రోగ్రాం పూర్తికాలేదని కాసేపట్లో వస్తానని తెలిపింది. అయితే కొద్దిసేపటి తర్వాత ఆమె సోదరుడు హనీఫ్ అమ్రీన్ కోసం ఆ హాలు దగ్గరికి వచ్చి షాక్‌ అయ్యాడు. అమ్రీన్‌ అక్కడ కనిపించలేదు. కంగారుపడిన సోదరుడు తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపాడు. అనంతరం రాత్రి ఒంటిగంట వరకు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. అయితే.. షాహిన్ కన్వెన్షన్ హాల్ నుంచి రాత్రి 11:30 ప్రాంతంలో తన చెల్లెలు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు వేరు వేరు కిడ్నాప్‌ లపై ఆరా తీస్తున్నారు.
Sridevi: ముగ్గురు చెల్లెల్లతో అతిలోక సుందరి అరుదైన ఫోటో… అందరితో కలిసి నటించింది ‘అతనొక్కడే’