NTV Telugu Site icon

మియాపూర్‌ సామూహిక లైంగికదాడి కేసు.. ఆగురికి జీవితఖైదు

Court

Court

మియాపూర్‌లో కలకలం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసులో ఆరుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు.. మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2019 జనవరి 19వ తేదీన ఓ మహిళపై హఫీజ్‌పేట రైల్వే స్టేషన్‌ సమీపంలో సామూహిక అత్యాచారం జరిగింది.. ఏడుగురు కామాంధులు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు.. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇక, ఎల్బీనగర్‌ న్యాయస్థానంలో తగిన ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించడంతో విచారణ చేపట్టిన కోర్టు.. నిందితులకు జీవితఖైదు విధిస్తూ ఇవాళ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ఓ మైనర్‌ కూడా ఉండడంతో.. అతడి కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో పెట్టింది..