Site icon NTV Telugu

తెలంగాణలో కరోనా అదే జోరు.. ఎన్ని కేసులంటే?

ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజల్లో నిర్లక్ష్యం తగ్గడం లేదు. తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్తగా మళ్లీ 4వేలకు పైగానే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు పెద్ద సంఖ్యలోనే కొత్త కేసులు బయటపడ్డాయి.సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్ళివచ్చినవారు పరీక్షలు చేయించుకోగా కేసులు పెరిగాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24గంటలలో 1 లక్షా 13 వేల 670 టెస్టులు చేయగా.. 4,559మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 1961మంది కోలుకోగా.. ఇద్దరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 36,269కి పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55శాతం ఉండగా.. రికవరీ రేటు 94.57శాతంగా ఉంది.

కొత్తగా నమోదైన కొవిడ్‌ కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1450 పాజిటివ్‌ కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాలో 432, రంగారెడ్డి 322, హనుమకొండ 201, ఖమ్మం 145, కరీంనగర్‌ 112, నల్గొండ జిల్లాలో 138 చొప్పున కొత్త కేసులు వచ్చాయి. మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం మరిచిపోవడంతో కేసుల సంఖ్య పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version