ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ప్రజల్లో నిర్లక్ష్యం తగ్గడం లేదు. తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొత్తగా మళ్లీ 4వేలకు పైగానే కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు పెద్ద సంఖ్యలోనే కొత్త కేసులు బయటపడ్డాయి.సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్ళివచ్చినవారు పరీక్షలు చేయించుకోగా కేసులు పెరిగాయని తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24గంటలలో 1 లక్షా 13 వేల 670 టెస్టులు చేయగా.. 4,559మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 1961మంది కోలుకోగా.. ఇద్దరు…