NTV Telugu Site icon

Ramakrishna Math: బుక్ లవర్స్‌కు శుభవార్త.. పుస్తకాలపై 40 శాతం డిస్కౌంట్

Book Lovers

Book Lovers

Ramakrishna Math: ఆన్‌లైన్‌లో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా మనకు నచ్చిన పుస్తకం కొనుగోలు చేసి చదువుతుంటే వచ్చే కిక్కే వేరు. అందుకే ఇప్పటికీ చాలా మంది రైళ్లు లేదా బస్సుల్లో పుస్తకాలు చదువుతూ కనిపిస్తుంటారు. ఈ నేపథ్యంలో పుస్తకాల ప్రియులకు హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం బంపర్ ఆఫర్ ఇచ్చింది. దివ్యజనని శ్రీ శారదాదేవి 170వ జయంతి సందర్భంగా డిసెంబర్ 15న హైదరాబాద్ రామకృష్ణ మఠంలో పుస్తకాల కొనుగోలుపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించింది. స్వామి వివేకానంద సాహిత్యంతో పాటు అనేక పుస్తకాలపై ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.

Read Also: Pavitra Lokesh: పవిత్ర- నరేష్ కేసులో కొత్త ట్విస్ట్.. వారికి దబిడిదిబిడే

అటు శారదాదేవి 170వ జయంతి సందర్భంగా ఈనెల 15వ తేదీ ఉదయం 5:30 గంటలకు సుప్రభాతం, మంగళ హారతి, భజనలు ఉంటాయని రామకృష్ణ మఠం ప్రతినిధులు వెల్లడించారు. ఉదయం 6:30 గంటలకు దేవాలయ ప్రదక్షిణం ఉంటుందని.. ఉ.7 గంటలకు విశేష పూజ, లలితా సహస్రనామ పారాయణం, భజనలు ఉంటాయని తెలిపింది. ఉదయం 10:30 గంటలకు హోమం నిర్వహించనున్నట్లు వివరించింది. ఉ.11:30 గంటలకు దివ్యజనని శ్రీ శారదాదేవి జీవితం, సందేశంపై ప్రసంగం ఉంటుందని పేర్కొంది. మధ్యాహ్నం 12:15 గంటలకు విశేష హారతి, మధ్యాహ్నం 12:30 గంటలకు భోజన ప్రసాదం ఉంటాయని చెప్పింది. మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయం దిగువ హాలులో శారదాదేవి చలనచిత్ర ప్రదర్శన, సాయంత్రం 6:45 గంటలకు ఆరాత్రికం, రాత్రి 7:15 గంటలకు ప్రత్యేక భజనలు ఉంటాయని.. భక్తులు ఈ మేరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు.

Show comments