బాసరలో అక్రమాలు.. సర్కార్ చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాసర దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సర్కార్ చర్యలు చేపట్టింది. 2017 సంవత్సరంలో వివిధ రూపాల్లో జరిగిన అక్రమాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. అప్పటి నుంచి ఓవైపు దేవాదాయశాఖ, మరోవైపు ఏసీబీ అక్రమాలపై విచారణ చేపట్టింది. నలుగురు ఉద్యోగులపై వేటు వేసింది. అప్పటి బాసర ఏఈవో గంగాశ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శైలేష్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించారు. ఎలక్ట్రీషియన్ కాంతారావు, కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన రజనికుమారీలను సర్వీస్ నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బాసర దేవాలయంలో జరిగిన అక్రమాలపై 2020లో ఏసీబీ సైతం కేసు నమోదు చేసింది. గతంలోనే ఏడుగురిపై కేసు నమోదైంది. అప్పటి ఈవో సుధాకర్ రెడ్డి, సూపరింటెండెంట్ సాయిలు…ప్రైవేట్ ఏజెన్సీలకు చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు అధికారులు. ఐతే…అప్పటి ఈవో, సూపరింటెండెంట్ రిటైర్డ్ కాగా ఉద్యోగులైన నలుగురిపై ఇప్పుడు వేటు వేశారు. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆదారంగా దేవాదాయశాఖ నలుగురిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బిల్స్, ఏజెన్సీల పేరుతో లక్షల రూపాయలు అవినీతి జరిగినట్లు ధ్రువీకరణ కావడంతో ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు.
Also Read
- Tags
- Basara Scam
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!