బాసర దేవస్థానంలో జరిగిన అక్రమాలపై సర్కార్ చర్యలు చేపట్టింది. 2017 సంవత్సరంలో వివిధ రూపాల్లో జరిగిన అక్రమాలపై ఎన్టీవీ వరుస కథనాలు ప్రచారం చేసింది. అప్పటి నుంచి ఓవైపు దేవాదాయశాఖ, మరోవైపు ఏసీబీ అక్రమాలపై విచారణ చేపట్టింది. నలుగురు ఉద్యోగులపై వేటు వేసింది. అప్పటి బాసర ఏఈవో గంగాశ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ శైలేష్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సర్వీస్ నుంచి తొలగించారు. ఎలక్ట్రీషియన్ కాంతారావు, కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసిన రజనికుమారీలను…