Missing Child: 24 గంటలు గడుస్తున్నా బాలిక మిస్సింగ్ కేసు మిస్టరీగా మారింది. అసలు ఎక్కడ వుంది? ఏం చేస్తుంది?. ఎవరు కిడ్నాప్ చేశారు? ఎందుకు చేశారు? అనేది ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన 4వ తరగతి విద్యార్థి మిస్సింగ్ కేస్ పోలీసులకు సవాల్ గా మారింది. 24 గంటలు దాటుతున్న బాలిక ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడం పై అదృష్యమైన బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం (నిన్న) ఉదయం 9 గంటలకు స్కూలుకు వెళ్లిన బాలిక తిరిగి ఇప్పటివరకు కనిపించలేదని, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు ఫిర్యాదు చేస్తే సాయంత్రం 6 గంటలకు పోలీసులు వచ్చారంటన్న కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. మా పాపపై ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడి ఏదైనా చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ ప్రశ్నిస్తున్నారు.
Read also: Gunny Bags Godown Fire: గన్నీ సంచుల గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం
NTV తో చిన్నారి తల్లిదండ్రులు మాట్లాడుతూ కన్నీరుపెట్టుకున్నారు. ఉదయం ఇంట్లోంచి స్కూలుకి తీసుకొని వెళ్లానని, స్కూల్లో దింపి తాను పనికి వెళ్లానని చెబుతున్నారు. ఉదయం 9.30 ప్రాంతంలో స్కూల్ సంబంధించిన టీచర్ పాప కనిపించట్లేదని ఫోన్ చేశారని అన్నారు. కంగారుపడి స్కూల్ దగ్గరకు వెళ్లామని స్కూల్లో పాప బ్యాగు మాత్రమే ఉందని వాపోయారు. పోలీసులకు చెప్పాము కానీ సరైన సమయంలో పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. ఉదయం చెప్తే సాయంత్రం వరకు కూడా పోలీసులు పాప ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ 24 గంటలు దాటుతున్న ఇంకా పాప ఎక్కడ ఉందో మాకు తెలియదని, మా పాప మాకు కావాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. స్కూల్ లో వదిలి వెలుతున్నప్పుడు లోపలికి వెళ్లిన పాప మళ్లీ ఎక్కడకు పోతుంది. స్కూల్ యాజమాన్యం కూడా ఇలా నిర్లక్ష్యం వహించడం సరికాదని పాప క్లాస్ లోకి వెళ్లిందని బ్యాగ్ కూడా తన స్థలంలో వుందని అయితే ఆతరువాత ఎక్కడకు వెలుతుందో స్కూల్ యాజమాన్యం, క్లాస్ టీచర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లల్ని స్కూల్ యాజమాన్యం పై వున్న నమ్మకంతో పంపిస్తే ఇలా నిర్లక్ష్యం చేసి తన పాపను దూరం చేశారని వాపోతున్నారు. వెంటనే పాప ఆచూకీ కనుగొని తనవద్దకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే.. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నరు. ఇందు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సీసీ కెమెరాలో నమోదైంది. మరి పోలీసులకు సవాల్ గా మారిన పాప ఆచూకి లభించేనా?
Corona Virus: వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం