NTV Telugu Site icon

రైతు బంధు.. రైతుల ఖాతాల్లో రూ.1,669.42 కోట్లు జ‌మ‌

Rythu Bandhu

క‌రోనా క‌ష్ట‌కాలంలోనూ రైతుల‌కు అండ‌గా ఉంటుంది తెలంగాణ ప్ర‌భుత్వం.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారి రైతుల‌కు పంట సాయం ప్ర‌క‌టించిన సీఎం కేసీఆర్.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల‌కు రైతు బంధు పేరుతో ఆర్థిక భ‌రోసి ఇస్తున్నారు.. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తుండ‌గా… రెండు రోజులలో రూ.1,669.42 కోట్లు రైతుల ఖాతాలలో జ‌మ‌చేసిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.. రెండ‌వ రోజు 15.07 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1152.46 కోట్లు జ‌మ అయిన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇక‌, రేపు మూడవ రోజు 10.40 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1272.85 కోట్లు జ‌మ అవుతాయ‌ని.. మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2942.27 కోట్లు జ‌మ అవుతాయ‌ని అధికారులు చెబుతున్నారు.. మూడో రోజు నల్లగొండకు అత్యధికంగా 79,727 మంది రైతులకు రూ.98.29 కోట్లు జ‌మ కానుండ‌గా.. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3701 మంది రైతులకు రూ.4.45 కోట్లు జ‌మ అవుతాయిన‌.. ఈ నెల 25 వరకు రైతులకు రైతుబంధు నిధుల పంపిణీని పూర్తి చేయ‌నున్నారు.

Show comments