దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి తీవ్రంగా ఉంది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కోవిడ్ కేసులు, అత్యధికంగా మరణాలు చోటుచేసుకుంటున్న దేశంగా భారత్ నిలిచింది. కాగా జూన్ చివరి నాటికి దేశంలో కోవిడ్ కేసులు పూర్తిస్థాయికి పడిపోతాయని హైదరాబాద్ ఐఐటీ నిపుణుడు డాక్టర్ విద్యాసాగర్ అంచనా వేశారు. అయితే టీకాల కార్యక్రమానికి చురుగ్గా చేపట్టి నియంత్రణలు పకడ్బందీగా అమలు చేయకపోతే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో థర్డ్‌వేవ్ వస్తుందని హెచ్చరించింది. టీకాల కార్యక్రమాన్ని వేగవంతం చేయడం ముఖ్యమని ఆయన సూచన చేశారు. జూన్ చివరినాటికి 15,000-25,000 స్థాయికి తగ్గుతాయని వివరించారు. దానినే మనం సెకండ్ వేవ్ అంతంగా చూడొచ్చని అన్నారు.