Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్.. సందర్శించనున్న కేంద్రం జల సంఘం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medigadda Barrage: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు. ఇవాల మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీని కేంద్రం జల సంఘం సభ్యులు సందర్శించనున్నారు. 20 పిల్లర్ సింక్ కావడంతో గేట్ విరిగింది. లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత నీటి ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 57 గేట్లు ఎత్తి 45,260 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇన్ ప్లో 12,240 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 45,260 క్యూసెక్కులు.. కాగా.. ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజ్ లో 0.632 టీఎంసిలు నీటినిలువ ఉంచారు అధికారులు. అయితే.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 144 సెక్షన్ అధికారులు విధించడంతో.. టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. బ్యారేజ్ వంతెన కుంగడంతో 20,21 పిల్లర్ వద్ద బాంబు పేలినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. భారీ శబ్ధంతో వంతెన కుంగడంతో సంఘవిద్రోహుల చర్యగా అనుమానం రావడంతో.. బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, డాగ్ స్కాడ్ రంగంలోకి దిగింది. బ్యారేజ్ ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది.
ప్రస్తుతం లక్ష్మీ బ్యారేజీ మీదుగా మహారాష్ట్రకు రాకపోకలు కొనసాగుతున్నాయి. కాగా, ప్రాజెక్టు పిల్లర్లు కూలిన మాట వాస్తవమేనని ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు తెలిపారు. గేట్ల నుంచి శబ్ధాలు వస్తున్నాయని.. తెల్లవారుజాము వరకు ఏమీ చెప్పలేమన్నారు. ప్రస్తుతం 40 గేట్లను తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని తిరుపతిరావు తెలిపారు. ఆదివారం ఉదయం అధికారులు బ్యారేజీని పరిశీలించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీని 2016 మే 2వ తేదీ నిర్మాణం చేపట్టగా.. 2019 జూన్ 21న ప్రారంభించారు. ఎల్‌అండ్‌టీ సంస్ ఈ బ్రిడ్జిని నిర్మించింది. వాస్తవానికి నిర్మాణ దశలోనే బ్యారేజీలోని 20వ నెంబరు పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని, అప్పట్లో దానికి మరమ్మతులు చేసి పని పూర్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజీ నిల్వ సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.100 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శనివారం సాయంత్రం నుంచి 8 గేట్ల ద్వారా 14,930 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే రాత్రివేళ మహారాష్ట్రకు వెళుతున్న వాహనదారులు వంతెన కుంగిపోయిన విషయాన్ని గుర్తించి బయటకు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Bhagavanth Kesari : బాలయ్య మూవీ 4 డేస్ కలెక్షన్ ఎంతంటే..?
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!