Site icon NTV Telugu

వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్

పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.

Read Also: రామకృష్ణ మరో సంచలన సెల్ఫీ వీడియో

కాగా రామకృష్ణ సెల్ఫీ వీడియో ద్వారా వనమా రాఘవేంద్రపై ఆరోపణలు చేశారని… అయితే ఘటన జరిగిన ఈనెల 3వ తేదీనే రామకృష్ణ బావమరిది జనార్థర్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేశామని ఏఎస్పీ రోహిత్ వెల్లడించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణం తానేనని విచారణలో వనమా రాఘవ ఒప్పుకున్నాడని ఆయన తెలిపారు. వనమా రాఘవపై ఈ కేసుతో పాటు మొత్తం 12 కేసులు ఉన్నాయని ఏఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఇతర కేసులపై కూడా విచారణ కొనసాగుతోందని… త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.

Exit mobile version